PM Modi : ఐఏఎస్ లు సమగ్ర విధానంపై ఫోకస్ పెట్టాలి
కొత్త ఐఏఎస్ ఆఫీసర్ల సమావేశంలో మోదీ
PM Modi : అభివృద్దిలో సమగ్ర విధానం అవసరమని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఐఏఎస్ ) తో జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగించారు. ప్రభుత్వం అభివృద్ది చెందాలంటే మీ పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఆయా రాష్ట్రాలలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు నరేంద్ర మోదీ. ప్రజలకు మెరుగైన రీతిలో ప్రభుత్వ సేవలు అందించాలంటే ముందు ఐఏఎస్ లు కీలకమన్నారు. అంతే కాకుండా స్థానిక సంస్కృతిపై అవగాహన పెంచు కోవాలని నరేంద్ర మోదీ సూచించారు.
పాలనపై దృష్టి దేశ రాజధాని ఢిల్లీని దాటి దేశమంతటా విస్తరించిందన్నారు ప్రధానమంత్రి. అసిస్టెంట్ సెక్రటరీ ప్రోగ్రామ్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. అమృత్ కాల్ సమయంలో దేశానికి సేవ చేసే అవకాశం ఉందన్నారు. పంచ్ ప్రాణ్ సాకారం చేయడంలో వారికి సహాయ పడుతుందన్నారు ప్రధానమంత్రి.
అభివృద్ది చెందిన భారత దేశ లక్ష్యాన్ని సాధించడంతో ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పారు. 100వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఈ కాలాన్ని ఆయన అమృత్ కాల్ అని పేర్కొన్నారు మోదీ. గత కొన్నేళ్లుగా దేశంలో స్టార్టప్ ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
ప్రభుత్వ విధానం ద్వారా అనేక మంత్రిత్వ శాఖలు జట్టుగా పని చేయడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు ప్రధానమంత్రి. గ్రౌండ్ లెవల్లో స్థానిక ప్రజలతో మరింత చొరవతో, ప్రేమతో వ్యవహరించాలని సూచించారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
Also Read : సీజేఐ నియామకంపై సస్పెన్స్