Usha Thakur : గుర్తింపు కార్డులుంటేనే గర్భాద్ దర్శనం
సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్
Usha Thakur : మధ్య ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్(Usha Thakur) షాకింగ్ కామెంట్స్ చేశారు. విగ్రహారాధన సరే ముస్లింలు గర్భాను సందర్శించ వచ్చన్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న లవ్ జిహాద్ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గర్బా వేదికల్లోకి ప్రవేశించేందుకు పాల్గొనే వారంతా తప్పనిసరిగా గుర్తింపు రుజువును కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముస్లింలు విగ్రహారాధనతో బాగుంటేనే గర్బాద్ మండళ్ల వద్దకు స్వాగతం పలుకుతారని చెప్పారు.
మధ్య ప్రదేశ్ లోని గర్బా పండాల్లోకి ప్రవేశించేందుకు గుర్తింపు కార్డులను తప్పనిసరి చేశామన్నారు. వారం రోజుల కిందట ప్రకటించిన మంత్రి మరో కీలక నిర్ణయం ప్రకటించారు.
గుర్తింపు కార్డులకు మరో దానిని చేర్చారు ఉషా ఠాకూర్(Usha Thakur). విగ్రహారాధనతో బాగుంటేనే అని మరో షరతు విధించారు. రాష్ట్రంలో లవ్ జిహాద్ సంఘటనల దృష్ట్యా ఒక హెచ్చరిక జారీ చేశారు.
పాల్గొనాలని అనుకునే వారంతా రుజువులు కలిగి ఉండాలని లేక పోతే ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముస్లింలు తమ పవిత్ర గ్రంతం విగ్రహారధనకు అనుమతిస్తే వారిని గర్భా(Garba) పండల్ల వద్ద స్వాగతం పలుకుతామని తెలిపారు.
విగ్రహారాధనలో విశ్వాసం ఉన్న ముస్లిం పురుషులు తమ మహిళా కుటుంబ సభ్యులతో కలిసి వస్తేనే గార్బా వేదికల వద్దకు ఆహ్వానిస్తామన్నారు.
ఉషా ఠాకూర్ గ్వాలియర్ లో మీడియాతో మాట్లాడారు. లవ్ జిహాద్ కు గర్బా పందాలు మాధ్యమంగా మారాయని మండిపడ్డారు.
Also Read : షిండే వల్లనే చిప్ ప్లాంట్ కోల్పోయాం