Shashi Tharoor : కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నికైతే పెను మార్పులు

తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ కామెంట్స్

Shashi Tharoor :  కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష బ‌రిలో ఉన్న తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అక్టోబ‌ర్ 17న పార్టీ చీఫ్ ఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 19న ఫ‌లితం ప్ర‌క‌టిస్తారు. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ. శ‌శి థ‌రూర్ గురువారం జాతీయ మీడియాతో మాట్లాడారు.

తాను గ‌నుక అధ్య‌క్షుడిగా ఎన్నికైతే పార్టీలో హైక‌మాండ్ క‌ల్చ‌ర్ ను మార్చేస్తాన‌ని పేర్కొన్నారు. కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీకి సంబంధించి అట్ట‌డుగు స్థాయి ఆఫీస్ బేర‌ర్ల‌కు అధికారం లేకుండా పోయింద‌ని దానిని తాను ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు.

పార్టీ ప‌రంగా రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో జ‌రిగిన చింతన్ శివిర్ లో తీర్మానం చేసిన ఉద‌య్ పూర్ డిక్లేరేష‌న్ ను అమ‌లు చేస్తాన‌ని శ‌శి థ‌రూర్ స్ప‌ష్టం చేశారు. సీడబ్ల్యూసీ ఎన్నిక‌లు, దాదాపు 25 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న పార్ల‌మెంట‌రీ బోర్డు పున‌రుద్ద‌ర‌ణ అవ‌స‌ర‌మ‌య్యే ప్ర‌స్తుత రాజ్యాంగాన్ని పూర్తిగా అమ‌లు చేస్తాన‌ని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వికేంద్రీక‌రించాల‌ని , అట్ట‌డుగు స్థాయి ఆఫీస్ బేర‌ర్ల‌కు నిజంగా అధికారం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల న‌మ్మ‌కం ఉన్న వారే త‌న‌కు ఓటు వేస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor). 2020లో పెద్ద ఎత్తున సంస్థాగ‌త సంస్క‌ర‌ణ‌లు కోరుతూ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసిన వారిలో ఎంపీ ఉన్నారు.

Also Read : పార్టీ ఉనికి కోస‌మే రాహుల్ గాంధీ యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!