DK Shiva Kumar : సీఎం కాక పోయినా ఎమ్మెల్యేగా ప‌ని చేస్తా

క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్

క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. సీఎం పోస్టులో ఎవ‌రు ఉంటార‌నే దానిపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఏఐసీసీ ఇంకా ఎవ‌ర‌నేది ప్ర‌క‌టించ లేదు. 224 సీట్ల‌కు గాను 135 సీట్లు ద‌క్కించుకుంది ఆ పార్టీ. మంగళ‌వారం ఇద్ద‌రు నేత‌లు పోటా పోటీగా డీకే శివ‌కుమార్, సిద్ద‌రామ‌య్య ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా ఖ‌ర్గేతో డీకే శివ‌కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు స‌మాచారం. త‌న‌కు సీఎం పోస్టు ఇవ్వ‌క పోయినా సాధార‌ణ ఎమ్మెల్యేగా ప‌ని చేస్తాన‌ని చెప్పారు. దేనికైనా సిద్దంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ హ‌వాను త‌ట్టుకుని నిల‌బ‌డిన ఏకైక నాయ‌కుడు డీకే శివ‌కుమార్. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు క్యాడ‌ర్ , నేత‌ల‌ను ముందుండి న‌డిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

దీంతో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ కు జ‌నం బ్ర‌హ్మ‌రథం క‌ట్టబెట్టారు. చివ‌ర‌కు సిద్ద‌రామ‌య్య గ‌తంలో సీఎంగా ప‌ని చేశారు. ఆయ‌న‌కు క్లీన్ ఇమేజ్ క‌లిగి ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఇక డీకే శివ‌కుమార్ మాత్రం ట్ర‌బుల్ షూట‌ర్ మారారు. ప్ర‌ధాని మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డాల‌ను త‌ట్టుకుని పార్టీని విజ‌య ప‌థంలో న‌డిపించిన నాయ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడు. కానీ సీఎం పోస్టు వ‌ర‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా ఏం జ‌రుగుతుంద‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Leave A Reply

Your Email Id will not be published!