కన్నడ నాట రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. కేవలం కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొనసాగుతోంది. మాజీ సీఎం , బీజేపీ అగ్ర నాయకుడు బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని పూర్తి కాలం పాటు సీఎంగా ఉండనీయ లేదని దీని వల్ల రాష్ట్రంలో అభివృద్ది కుంటు పడిందన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం చేయనంతగా కృషి చేశారని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత తన తండ్రిదన్నారు. అందుకే లక్షలాది మంది ప్రజలు నేటికీ తమ నాయకుడిగా ఆయనను చూస్తున్నారని చెప్పారు. కానీ ఎందుకనో పార్టీ హైకమాండ్ మా నాన్న పట్ల కనికరం చూపలేదన్నారు. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసి ఉంటే ప్రజలకు మరింత మేలు జరిగి ఉండేదన్నారు బీవై విజయేంద్ర.
ఎలాంటి పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా పాలన సాగించారని చెప్పారు. 80 ఏళ్ల వయస్సులో కూడా అలుపెరుగకుండా పని చేశారని , పార్టీని నిలబెట్టారని , కానీ హైకమాండ్ పట్టించు కోలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు బీవై విజయేంద్ర. తన తండ్రి మాటలు చెప్పరని చేతుల్లో చూపిస్తారని అన్నారు. తన తండ్రి లేక పోతే బీజేపీ లేదన్నారు.