K Annamalai : దమ్ముంటే అరెస్ట్ చేయండి – అన్నామలై
తమిళనాడు సర్కార్ కు సవాల్
K Annamalai Stalin : తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై(K Annamalai) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన డీఎంకే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దమ్ముంటే తనను 24 గంటల్లోపు అరెస్ట్ చేయాలని అన్నారు. బీహార్ వలసదారులపై ట్వీట్ చేసినందుకు అన్నామలైపై అభియోగాలు మోపారు. తాను చేసింది గనుక తప్పని తేలితే తనను అరెస్ట్ చేయొచ్చంటూ పేర్కొన్నారు. అంత దమ్ము ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు బీజేపీ స్టేట్ చీఫ్.
తనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారంటూ ఆరోపించారు. ఇలా కేసులు నమోదు చేసి తనను భయపెట్ట లేరంటూ హెచ్చరించారు కె. అన్నామలై. ప్రజాస్వామ్య గొంతును అణిచి వేస్తామని అనుకోవడం భ్రమ అని పేర్కొన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ గా నేను సవాల్ చేయడం లేదు ఎంకే స్టాలిన్ సర్కార్ ను. నేను ఒక సామాన్యుడిగా మీకు ఒక రోజు సమయం ఇస్తున్నానని అన్నారు.
వీలైతే దమ్ముంటే తనను తాకి చూడాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. ఇదిలా ఉండగా హింసను ప్రేరేపించడం, ఇతరుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి సెక్షన్ల కింద రాష్ట్ర సైబర్ క్రైం విభాగం కె. అన్నామలైపై(K Annamalai Stalin) అభియోగాలు మోపింది.
దీనిపై సీరియస్ గా స్పందించారు బీజేపీ స్టేట్ చీఫ్. నిరాధారమైన ఆరోపణలు చేయడం డీఎంకే సర్కార్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. దమ్ముంటే తనను టచ్ చేయాలని మరోసారి సవాల్ విసిరారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాష్ట్ర పార్టీకి బాధ్యుడిగా తాను ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుదని నిలదీశారు కె. అన్నామలై.
Also Read : దర్యాప్తు సంస్థలపై పీఎంకు లేఖ