Rahul Gandhi : మౌనంగా ఉంటే దేశాన్ని అమ్మేస్తారు
ప్రధానమంత్రి మోదీపై రాహుల్ ఫైర్
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) షాకింగ్ కామెంట్స్ చేశారు. మౌనంగా ఉంటే ప్రజలు ప్రశ్నించక పోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గంప గుత్తగా దేశాన్ని అమ్మేస్తారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రధాని గా మోదీ కొలువు తీరాక ఏ ఒక్క ప్రభుత్వ సంస్థను కుదురుగా పని చేయనీయడం లేదంటూ మండిపడ్డారు. ఓ వైపు ద్రవ్యోల్బణం మరో వైపు నిరుద్యోగం తాండవిస్తోందన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని ప్రచార ఆర్భాటం తప్ప ఒరిగింది ఏమీ లేదన్నారు రాహుల్ గాంధీ. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భగా రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. మోదీపై(PM Modi) నిప్పులు చెరిగారు. రైతులకు మేలు చేకూరుస్తాన్ననంటూ చెబుతుంటే ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని ప్రశ్నించారు.
బడా వ్యాపారులు కాదు కావాల్సింది నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించాలన్నారు. గ్యాస్ , పెట్రోల్, వంట నూనె ధరలు దారుణంగా పెరిగాయని ఆవేదన చెందారు.
75 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందని అంటున్నారని మరి తాను ఏం చేశారో చెప్పాలన్నారు. తాను చేసింది ఒక్కటే ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారని ఇదే ఆయన సాధించిన ప్రగతి అని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
తాను ప్రజల తరపున ప్రశ్నిస్తానని ఈడీకి మోదీకి, కేడీలకు తాను భయపడనని స్పష్టం చేశారు. మీడియా సైతం ప్రజల వైపు లేకుండా పోయిందన్నారు. దేశాన్ని రక్షించు కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.
Also Read : టీఎంసీ ఎమ్మెల్యే..చైర్మన్ ఇళ్లపై సోదాలు