Shashi Tharoor Pawan Khera : మాట్లాడితే అరెస్ట్ చేస్తారా
ఇదో రకమైన మోదీ స్టైలా అంటూ ఎద్దేవా
Shashi Tharoor Pawan Khera : ప్రధానమంత్రి మోదీని అవమానించారనే ఆరోపణలపై కాంగ్రెస్ మీడియా సెల్ హెడ్ , సీనీయర్ నాయకుడు పవన్ ఖేరాను(Pawan Khera) నాటకీయ పరిణామాల మధ్య అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎయిర్ పోర్ట్ లోనే ఆందోళనకు దిగింది. అనంతరం సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్ విచారణ చేపట్టారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
ఇదే సమయంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో పవన్ ఖేరాకు స్వేచ్ఛ లభించింది. తాను తప్పు మాట్లాడ లేదని ఉన్నదే చెప్పానని అన్నారు పవన్ ఖేరా. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై ఎంపీలు జైరాం రమేష్ , శశి థరూర్(Shashi Tharoor Pawan Khera) నిప్పులు చెరిగారు.
ఇది మోదీ స్టైల్ లో ఒక భాగమంటూ ఎద్దేవా చేశారు. వేధింపులు అనేవి మోడీ స్టైల్ అంటూ ఎద్దేవా చేశారు. పూర్తిగా అప్రజాస్వామికం..అనైతికమని పేర్కొన్నారు. చీటికి మాటికి ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే దేశంలో జైళ్లంటూ ఉండవన్నారు. దేశమే ఒక జైలుగా మారి పోతుందని హెచ్చరించారు.
ప్రశ్నించడం, నిలదీయడం భారత రాజ్యాంగంలో పొందు పర్చిన హక్కు. దానిని కాదనేందుకు మోదీకి లేదని మండిపడ్డారు శశి థరూర్. ఇదిలా ఉండగా పార్టీ స్పోక్స్ పర్సన్ జైరాం రమేష్ సైతం నిప్పులు చెరిగారు మోదీపై. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు.
Also Read : పవన్ ఖేరాకు ‘సుప్రీం’ ఊరట