MP Sanjay Singh : కూతురికి ఎల్జీ అక్రమ కాంట్రాక్టు – ఆప్
వినయ్ కుమార్ సక్సేనాను తొలగించండి
MP Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ తగ్గేదే లే అంటోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా(Vinaykumar Saxena), ఢిల్లీ సర్కార్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
ఇప్పటికే ఆయన కేంద్ర ఖాదీ బోర్డు సంస్థ చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమంగా నోట్ల రద్దును మార్పిడి చేశారంటూ ఆరోపించింది. ఇదే సమయంలో తాను పరువు నష్టం దావా వేస్తానంటూ ఎల్జీ హెచ్చరించారు.
ఈ తరుణంలో మరో సంచలన ఆరోపణ చేసింది ఆప్. తన కూతురికి అక్రమంగా కాంట్రాక్టు అప్పగించారని వెంటనే ఢిల్లీ ఎల్జీని తొలగించాలని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh) డిమాండ్ చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించి తన కూతురు శివంగి సక్సేనాకు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఆరోపించారు. వెంటనే సక్సేనాపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకేఎస్ తన పదవిని దుర్వినియోగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్ సింగ్. కేవీఐసీ చైర్మన్ గా ఉన్న సమయంలో కూతురుకు ముంబై లోని ఖాదీ లాంజ్ ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్టు ఇచ్చారంటూ ఆరోపించారు.
ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. కాంట్రాక్టు ఇవ్వడంలో వినయ్ కుమార్ సక్సేనా చట్టం 1961 నిబంధనలు ఉల్లంఘించాడని ఆప్ ఎంపీ నిప్పులు చెరిగాడు.
పైకి నీతులు వల్లిస్తున్న ఎల్జీ నిర్వాకం ఏమిటో ఆయన చేసిన తప్పులు ఏంటో మరికొన్నింటిని వెలుగులోకి తీసుకు వస్తామన్నారు.
Also Read : కామారెడ్డి కలెక్టర్ పై నిర్మలా కన్నెర్ర