LG Saxena Kejriwal : సీఎం ఐఐటీ డిగ్రీ ఉన్న నిరక్షరాస్యుడు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై షాకింగ్ కామెంట్స్
LG Saxena Kejriwal : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పుడైతే ఆయన ఎల్జీగా కొలువు తీరారో ఆనాటి నుంచీ సీఎంకు ఎల్జీకి(LG Saxena Kejriwal) పడడం లేదు. ఆయన వచ్చాకే ఢిల్లీ మద్యం పాలసీలో మార్పు చేర్పులపై ఆరా తీశారు. ఆపై సీబీఐకి విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
ఏకంగా 34 మందిపై అభియోగాలు మోపింది. పలువురిని అరెస్ట్ చేసింది. ఇందులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. ఇది పక్కన పెడితే తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పదే పదే ప్రధానమంత్రికి సంబంధించి చదివిన సర్టిఫికెట్లు చూపాలని కోరారు. ఇందుకు సంబంధించి ఆయన గుజరాత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆ పిటిషన్ ను కొట్టి వేసింది. చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
రూ. 25 వేలు జరిమానా విధించింది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్(LG Saxena) కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఐఐటీ డిగ్రీ కలిగి ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా నిరక్షరాస్యుడంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్జీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒక రకంగా పీఎం మోదీకి మద్దతుగా వినయ్ కుమార్ సక్సేనా ఈ కామెంట్స్ చేశారని కొందరు పేర్కొంటున్నారు. ఒక వివాదం పూర్తయిన వెంటనే మరో వివాదం ముందుకు వస్తోంది.
Also Read : ప్రాజెక్ట్ టైగర్ విజయం దేశానికి గర్వకారణం