Hemant Soren : నేను సీఎంను ఎక్కడికీ పారిపోను – సోరేన్
జార్ఖండ్ సీఎం సంచలన కామెంట్స్
Hemant Soren : జేఎంఎం చీఫ్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్(Hemant Soren) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన ప్రధాని మోదీ, అమిత్ షా కావాలని బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. తాను రాష్ట్రానికి సీఎంగా ఉన్నానని, ఎక్కడికీ పారి పోవడం లేదన్నారు.
ఇప్పటికే బీజేపీ త్రయం ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది రాష్ట్రాలను కూల్చి వేయడంలో సక్సెస్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు. ఇక మిగలిన రాష్ట్రాలను గవర్నర్లను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కానీ వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు చేసినా జార్ఖండ్ లో వారి ఆటలు సాగవన్నారు.
జార్ఖండ్ ముక్తీ మోర్చా అన్నది ఆషా మాషీ పార్టీ కాదని మోదీ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. తాము పోరాడి సాధించుకున్నామని దీనిని కూల్చి వేస్తామంటే ఊరుకోబోమంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హేమంత్ సోరేన్. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా అక్రమ మైనింగ్ ద్వారా మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీఎం హేమంత్ సోరేన్(Hemant Soren).
ఇప్పటికే సీఎంకు సమన్లు జారీ చేసింది తమ ముందు హాజరు కావాలని. ఇందుకు తాను 16న రానని 17న హాజరు అవుతానని స్పష్టం చేశారు హేమంత్ సోరేన్. ఇదిలా ఉండగా ఈడీ ఆఫీసుకు బయలు దేరే ముందు ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
పూర్తి ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందుకు రావాలని అన్నారు. అర్థం పర్థం లేకుండా నోటీసులు జారీ చేయడం మంచి పద్దతి కాదని కేంద్ర దర్యాప్తు సంస్థలపై మండిపడ్డారు సీఎం.
Also Read : 18న యాక్టివిస్ట్ గౌతమ్ నవ్లాఖా కేసు విచారణ