US PAK Redux : పాక్ యుఎస్ భేటీ క్వాడ్ పై ప్ర‌భావం

అమెరికా వ్యూహంపై భార‌త్ అభ్యంత‌రం

US PAK Redux : అమెరికా పాకిస్తాన్ ప‌ట్ల అనుస‌రిస్తున్న వ్యూహంపై తీవ్ర అభ్యంత‌రం(US PAK Redux) వ్య‌క్తం చేసింది భార‌త్. ఎఫ్‌-16 ప్యాకేజీని ప్ర‌క‌టించ‌డం ద్వారా వ్యూహాత్మ‌క అంశాన్ని ప్రారంభించింది. పాక్ ఆక్ర‌మిత భూభాగాన్ని ఆజాద్ జోన్ అని పిల‌వ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ క‌మ‌ర్ జావేద్ బ‌జ్వాతో అమెరికా ర‌క్ష‌ణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ భేటీ అయ్యారు.

బ్యూరోక్రాటిక్ స్థాయిలో పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీఓకే) పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త్ తీవ్ర ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేసింది. ఈ విష‌యాన్ని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కు తెలియ చేసింది. గ‌త నెల‌లో పెంట‌గాన్ ప్ర‌క‌టించిన పాకిస్తాన్ ఎఫ్ -16 యుద్ధ విమానాల కోసం యుఎస్ డి -450 మిలియ‌న్ల అప్ గ్రేడ్ ప్యాకేజీపై కూడా మోడీ ప్ర‌భుత్వం అత్యున్న‌త రాజ‌కీయ స్థాయిలో అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

ఒక నెల వ్య‌వ‌ధిలో బైడెన్(Joe Biden) అడ్మినిస్ట్రేష‌న్ మొద‌ట ఎఫ్‌-16 ప్యాకేజీని ప్ర‌క‌టించ‌డం ద్వారా వ్యూహాత్మ‌క అంశాన్ని ప్రారంభించింది. ఆజాద్ జోన్ అని పిల‌వాడ‌న్ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది భార‌త్. ద్వైపాక్షిక విష‌యాల‌ను మ‌రింత క్లిష్ట‌త‌రం చేసేందుకు , నేరాలు, ఉగ్ర‌వాదం కార‌ణంగా భార‌త‌దేశానికి వెళ్లే పౌరుల‌కు అమెరికా ప్ర‌యాణ స‌ల‌హాల‌ను జారీ చేసింది.

పౌర అశాంతి, ఉగ్ర‌వాదం కార‌ణంగా జ‌మ్మూ, కాశ్మీర్ కు వెళ్ల వ‌ద్ద‌ని సూచించింది. ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆయుధాల ఒప్పందం విష‌యంలో తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌న్న దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : ఎయిర్ ఫోర్స్ లో వెప‌న్ సిస్టమ్ బ్రాంచ్

Leave A Reply

Your Email Id will not be published!