Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. తనపై అవిశ్వాస తీర్మానం వీగి పోయిన అనంతరం అధికారిక నివాసం నుంచి ఖాళీ చేశారు. ఈ సందర్బంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశం అయ్యారు.
కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తన ప్రభుత్వం కూలి పోయేందుకు దేశ వ్యతిరేక శక్తులు యత్నించాయని ఆరోపించారు. తాను దేశం విడిచి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సంచలన ప్రకటన చేశారు.
దేశానికి స్వాతంత్రం రాలేదన్నారు. మళ్లీ స్వేచ్ఛ కోసం , స్వాతంత్రం కోసం పోరాటం సాగిస్తామని వెల్లడించారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan). పీటీఐ సెంట్రల్ కోర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఇసీ ) సమావేశానికి అద్యక్షత వహించారు.
వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ఓటమి అంగీకరించిన అనంతరం యుద్దం మళ్లీ ప్రారంభం అవుతుందన్నారు.
ఇమ్రాన్ ఖాన్ మరోసారి విదేశీ కుట్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ – ఇ – ఇన్సాఫ్ పార్టీ ( పీటీఐ ) ఈనెల 11న జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు.
పాకిస్తాన్ 1947 లో స్వాతంత్రం పొందిన దేశంగా అవతరించింది. అయితే పాలనా పరమైన మార్పునకు సంబంధించిన విదేశీ కుట్రకు వ్యతిరేకంగా పోరాటం ఇవాల్టి నుంచి మళ్లీ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
దేశ ప్రజలే తమ సార్వభౌమాధికారాన్ని , ప్రజాస్వామ్యాన్ని కాపాడు కుంటారని వెల్లడించారు. ఇదిలా ఉండగా కేవలం 2 ఓట్ల తేడాతో ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోయారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా కోల్పోవడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
Also Read : రెండు ఓట్ల తేడాతో ఇమ్రాన్ అవుట్