Imran Khan Arrest : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

ఐదేళ్ల పాటు నిషేధం

Imran Khan Arrest  : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. అవినీతికి సంబంధించిన కేసులో నేరం రుజువు కావ‌డంతో ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. అంతే కాకుండా 5 సంవ‌త్స‌రాల పాటు రాజ‌కీయాల నుండి నిషేధానికి గురయ్యాడు. త‌న కెరీర్ లో ఇది మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలి పోతుంది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రిగా ఉన్న స‌మ‌యంలో విదేశీ ప్ర‌ముఖ‌ల నుంచి పెద్ద ఎత్తున గిఫ్టులు పొందాడ‌ని, వాటిని విక్ర‌యించాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీటిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించింది.

Imran Khan Arrest Viral

శ‌నివారం అత్యున్న‌త న్యాయ స్థానం తీర్పు వెలువ‌రించింది. ఈ కేసుకు సంబంధించి దోషిగా ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ను తేల్చింది. 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది ధ‌ర్మాస‌నం. అంతే కాకుండా పాలిటిక్స్ లో ఎక్క‌డా పాల్గొన‌కుండా 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఇస్లామాబాద్ ట్ర‌య‌ల్ కోర్టు ఈ డెసిష‌న్ తీసుకుంది.

ఇమ్రాన్ ఖాన్ వ‌య‌సు 70 ఏళ్లు. ఆ దేశంలో అత్య‌ధిక జ‌నం ఆయ‌నను హీరోగా భావిస్తారు. కార‌ణం మొద‌ట క్రికెట‌ర్, కెప్టెన్. ఆ దేశానికి హీరో వ‌ర్షిప్ ను క్రికెట్ ప‌రంగా తీసుకు వ‌చ్చిన అరుదైన లీడ‌ర్ ఇమ్రాన్ ఖాన్. కానీ అనూహ్యంగా పార్టీ పెట్టాడు. ఆపై పీఎం అయ్యాడు. కానీ ఆర్మీ కుట్ర ఫ‌లితంగా తాను వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇటీవ‌లే అవిశ్వాస తీర్మానంతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. మొత్తంగా ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్ల‌డం ఆ పార్టీకి తీర‌ని దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Janasena NRI : జ‌న‌సేన‌కు ఎన్నారైలు కోటి విరాళం

Leave A Reply

Your Email Id will not be published!