Imran Khan Arrest : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఉద్రిక్తం
లాహూర్ లో ఆందోళన ఉధృతం
PAK Imran Khan Arrest : పాకిస్తాన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan Arrest) ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. గత కొంత కాలంగా ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ క్యానన్ లు ప్రయోగించారు. పెద్ద ఎత్తున ప్రస్తుత సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లాహూర్ లో కొలువు తీరిన ఇమ్రాన్ ఖాన్ ఇంటి వెలుపల భారీ ఎత్తున అనుచర గణం చేరుకుంది. కోర్టు ఆదేశం మేరకు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ నుండి పోలీసు బృందం వచ్చింది.
వేలాది మంది మాజీ ప్రధానమంత్రి ఇంటి ముందు , వెలుపల గుమిగూడారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కార్యకర్తలు హింసను ప్రారంభించారు. రాళ్లు రువ్వడంతో పోలీసు అధికారులను తీవ్రంగా గాయపడేలా చేఏసింది. ఇమ్రాన్ ఖాన్ కోర్టులో తన ఉనికిని నిర్దారిస్తే అది మంచిది..లేకపోతే చట్టం తన దారిలో పడుతుందని హెచ్చరించింది ఇప్పటికే ధర్మాసనం.
ఇదిలా ఉండగా కోర్టు ఆదేశాలను పాటించడం కోసమే తాము ఇక్కడికి వచ్చామని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సయ్యద్ షాజాద్ నదీమ్ స్పష్టం చేశారు. రాళ్లతో పాటు ఇటుకలు తమపై పడ్డాయన్నారు. నీటి ఫిరంగిని ప్రయోగించారు. గత్యంతరం లేక లాఠీ ఛార్జ్ కు దారి తీసింది.
గత ఏడాది అక్టోబర్ లో పాకిస్తాన్ ఎన్నికల సంఘం 70 ఏళ్ల క్రికెటర్ గా మారిన రాజకీయ వేత్తను చట్ట విరుద్దంగా విదేశీ ప్రముఖుల నుండి బహుమతులు అమ్మినందుకు దోషిగా నిర్దారించింది. దీంతో కోర్టు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్(Imran Khan Arrest) చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 80 కేసులు ఉన్నాయి.
Also Read : రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఎలా