Imran Khan Bail : ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు

అరెస్ట్ చ‌ట్ట విరుద్ద‌మ‌ని కామెంట్స్

మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు శుక్ర‌వారం బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండ‌గా ఇస్లామాబాద్ హైకోర్టుకు కేసు విష‌య‌మై హాజ‌ర‌య్యేందుకు వెళ్లారు. ఈ స‌మ‌యంలో పాకిస్తాన్ కు చెందిన పారా మిలిట‌రీ ఫోర్స్ చుట్టు ముట్టింది. ఖాన్ ను అదుపులోకి తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఆర్మీ హెడ్ క్వార్ట‌ర్స్ పై దాడులకు దిగారు ఖాన్ మ‌ద్ద‌తుదారులు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అక్ర‌మ‌మంటూ ఆయ‌న పార్టీ త‌ర‌పున సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచారించిన ముగ్గురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

కేసు విష‌యంలో హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన అత‌డిని అరెస్ట్ చేయ‌డం , ఎలాంటి ముంద‌స్తు స‌మ‌చారం లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ ప్ర‌శ్నించింది. ఈ కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. తాజాగా నేష‌న‌ల్ అకౌంట‌బిలిటీ బ్యూరో (ఎన్ఏబీ ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ధ‌ర్మాస‌నం.

ఈ సంద‌ర్బంగా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేయ‌డం చెల్ల‌ద‌ని అంతిమ తీర్పు వెలువ‌రించింది. ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ తీర్పును మే 11న గురువారం వెలువ‌రించింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టు ఆయ‌న‌కు రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్ ఖాన్ విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది.

Leave A Reply

Your Email Id will not be published!