Imran Khan Shot : ర్యాలీలో కాల్పులు ఇమ్రాన్ ఖాన్ కు గాయాలు
ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి గందరగోళం
Imran Khan Shot : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నియాజి తీవ్రంగా గాయపడ్డారు(Imran Khan Shot). పాకిస్తాన్ లోని గుజ్రన్ వాలాలో ర్యాలీలో కాల్పులకు పాల్పడడంతో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆయనపై దాడి జరిగే అవకాశం ఉందని ముందే హెచ్చరించింది.
గుజ్రాన్ వాలా లోని అల్లావాలా చౌక్ లో ఇమ్రాన్ ఖాన్ రిసెప్షన్ క్యాంప్ సమీపంలో తుపాకీ కాల్పులు జరిగాయి. ఆ తర్వాత గందరగోళ దృశ్యాలు బయట పడ్డాయి. స్థానిక ఛానల్ జియో న్యూస్ నివేదించింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన లాంగ్ మార్చ్ లో కాల్పులు జరిపిన తర్వాత ఇమ్రాన్ కాన్ ను కారులోకి తరలించారు.
ఆయన కుడి కాలుకు కట్టుకట్టి వాహనంలో తరలించారు. లాంగ్ మార్చ్ ను ఉద్దేశించి మాజీ క్రికెటర్ కంటైనర్ ట్రక్కుపై నిలబడి ఉన్నప్పుడు దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇస్లామాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటన 2007లో జరిగిన ర్యాలీలో మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టోను కాల్చి చంపిన తీరును గుర్తుకు తెచ్చిందన్నారు. తీవ్ర గాయాలతో ఇమ్రాన్ ఖాన్ బయట పడ్డారని సమాచారం.
ఇదిలా ఉండగా కాల్పులకు ఒక గంట ముందు ఇమ్రాన్ ఖాన్ గుజ్రన్ వాలా లోని మరో ప్రాంతంలో తన మద్దతుదారులతో ప్రసంగించాల్సి ఉంది. తనతో పాటు మరొక చౌక్ కు వెళ్లాలని, అక్కడ మాట్లాడతారని హామీ ఇచ్చారని సమాచారం. ఆయన ప్రసంగించేందుకు పైకి ఎక్కుతుండగా కాల్పులు జరిగినట్లు టాక్. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : రాజకీయ పరపతికి ప్రయారిటీ పెరిగింది