Imran Khan : భార‌త దేశ‌ విదేశాంగ విధానం భేష్

మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కితాబు

Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మ‌రోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న భార‌త దేశాన్ని ప్ర‌శంస‌లతో ముంచెత్తారు. ఆ దేశ విదేశాంగ విధానం గొప్ప‌గా ఉంద‌ని కితాబు ఇచ్చారు.

అమెరికా ఒత్తిడికి త‌లొగ్గి ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా ఊహించ‌ని రీతిలో భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణియం జై శంక‌ర్ మాట్లాడిన మాట‌ల‌తో కూడిన వీడియోను ప్లే చేస్తూ భార‌త్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) .

ర‌ష్యా చ‌మురును కొనుగోలు చేస్తున్నందుకు భార‌త్ ను అభినందించాడు. స్లోవేకియాలో జ‌రిగిన బ్రాటిస్లావా ఫోరం నుడి విదేశాంగ మంత్రి జై శంక‌ర్ వీడియో ను ప్లే చేశాడు.

ర‌ష్యా నుండి చౌక‌గా చ‌మురును కొనుగోలు చేయ‌డంపై అమెరికా ఒత్త‌డి చేసినా భార‌త్ స‌సేమిరా అంటూ కొట్టి పారేసింద‌న్నాడు. ఇందుకు తాను ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు చెప్పాడు ఇమ్రాన్ ఖాన్.

పాకిస్తాన్ తో స‌మాన‌మైన స‌మ‌యంలో స్వాతంత్రం పొందిన భార‌త దేశం అద్భుతమైన విధానాన్ని అవ‌లంభిస్తోంద‌న్నారు.

కానీ పాకిస్తాన్ దేశంలో అలాంటి విదేశీ విధానం లేకుండా పోయింద‌న్నారు మాజీ ప్ర‌ధాన‌మంత్రి. జై శంక‌ర్ మాట్లాడిన వీడియోను చాలా మీడియా సంస్థ‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా షేర్ చేశాయ‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు ఇమ్రాన్ ఖాన్.

యూర‌ప్ ర‌ష్యా నుంచి గ్యాస్ కొంటోంద‌ని తాము ఏమైనా అభ్యంత‌రం చెప్పామా అన్న దానిని ప్ర‌స్తావించారు.

Also Read : సంక్షోభం అంచున పాకిస్తాన్ – ప్ర‌ధాని

Leave A Reply

Your Email Id will not be published!