Imran Khan : నా అరెస్ట్ ఊహించిందే – ఇమ్రాన్ ఖాన్

ఇదంతా లండ‌న్ నుంచి జ‌రిగిందే

Imran Khan : పాకిస్తాన్ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. విదేశీ ప్ర‌ముఖులు ఇచ్చిన బ‌హుమతుల‌ను ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఇమ్రాన్ ఖాన్ విక్రయించాడంటూ కేసు న‌మోదైంది. ఈ కేసును విచారించింది కోర్టు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. నేరం రుజువైంద‌ని దీంతో ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం తెలిపింది. ఇదే స‌మ‌యంలో ఇస్లామాబాద్ కోర్టు మ‌రో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 5 సంవ‌త్స‌రాల పాటు ఇమ్రాన్ ఖాన్ ను క్రియా శీల‌క రాజ‌కీయాల నుంచి నిషేధం విధిస్తున్న‌ట్లు షాక్ ఇచ్చింది.

Imran Khan Arrest Shocking Comments

దీంతో భారీ ఎత్తున భ‌ద్ర‌తా పారా మిల‌ట‌రీ బ‌ల‌గాలు ఇమ్రాన్ ఖాన్ ఇంటికి చేరుకున్నాయి. ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నాయి. వేలాది మంది అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఇమ్రాన్ నివాసానికి చేరుకున్నారు. ముందే ఊహించ‌డంతో ఇమ్రాన్ ఖాన్ ఎవ‌రినీ ఆవేశ ప‌డ‌కూడ‌ద‌ని కోరారు. ఈ మేర‌కు వీడియో సందేశాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు మాజీ ప్ర‌ధాన‌మంత్రి.

త‌న అరెస్ట్ వెనుక కుట్ర జరిగింద‌ని ఆరోపించారు. దీనికి లండ‌న్ వేదిక‌గా ప్లాన్ వేశారంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. ఇదిలా ఉండ‌గా లాహోర్ లో ఉన్న ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్క‌డి నుంచి ల‌ఖ్ ప‌త్ జైలుకు త‌ర‌లించారు. ఎలాంటి న్యాయ విచార‌ణ జ‌ర‌గ‌కుండానే అక్ర‌మ కేసులు బ‌నాయించారంటూ ఆరోపించారు పార్టీ శ్రేణులు.

Also Read : Janasena NRI : జ‌న‌సేన‌కు ఎన్నారైలు కోటి విరాళం

Leave A Reply

Your Email Id will not be published!