Imran Khan : కుట్ర నిజం దౌత్య‌వేత్త‌పై ఆగ్ర‌హం

పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫైర్ 

Imran Khan : పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి, ఆ దేశ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు అమెరికాపై.

త‌న‌పై జ‌రిగిన కుట్ర నిజ‌మ‌ని, ఇందులో భాగం పంచుకుంది మాత్రం అమెరికా దౌత్య‌వేత్త‌నంటూ మండిప‌డ్డారు. జాతీయ అసెంబ్ల‌లో అవిశ్వాస తీర్మానం నుంచి పాకిస్తాన్ ప్ర‌ధానమంత్రి బ‌తికి ఉంటే ప్ర‌తిఫలాలు వ‌స్తాయ‌ని అమెరికాలోని పాకిస్తాన్ రాయ‌బారి అస‌ద్ మ‌జీద్ ను డొనాల్డ్ లు హెచ్చ‌రించార‌ని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ త‌న‌పై కుట్ర‌లో అమెరికా ప్ర‌మేయం ఉంద‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ద్వారా త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చి వేసేందుకు విదేశీ కుట్ర పాల్ప‌డిన వ్య‌క్తిగా డొనాల్డ్ లూ పేరును ప్ర‌స్తావించారు.

నేష‌న‌ల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ అవిశ్వాస తీర్మానాన్ని తిర‌స్క‌రించారు. అనంత‌రం పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నాయ‌కుల స‌మావేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా జాతీయ భ‌ద్ర‌త‌ను ఉటంకిస్తూ దేశంలోని అత్యున్న‌త భ‌ద్ర‌తా సంస్థ త‌న‌ను హెచ్చ‌రించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.

దేశ అంత‌ర్గ‌త రాజ‌కీయాల్లో విదేశీ  జోక్యం మ‌రింత పెరిగింద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. అయితే ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)చేసిన ఆరోప‌ణ‌ల‌ను అమెరికాతో పాటు విప‌క్షాలు తోసిపుచ్చాయి.

ఇదిలా ఉండ‌గా అవిశ్వాస తీర్మానం వీగి పోయింద‌ని, విప‌క్షాలు ప‌న్నిన కుట్ర అని తేలింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా తాను అల్లాకు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్.

Also Read : శ్రీ‌లంక సంక్షోభం పెల్లుబికిన ప్ర‌జాగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!