ED Raids : ఎక్సైజ్ పాల‌సీ కేసులో ఈడీ దాడులు

దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల సోదాలు

ED Raids : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టంచిన ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ కేసులో ఈడీ(ED Raids) మ‌రో ముంద‌డుగు వేసింది. ఇప్ప‌టికే సీబీఐ సోదాలు చేప‌ట్టింది.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా నివాసంలో 14 గంట‌ల పాటు ద‌ర్యాప్తు చేప‌ట్టింది. చివ‌ర‌కు ఆయ‌న‌కు చెందిన ఫోన్ , కంప్యూట‌ర్ల‌ను సీజ్ చేసింది.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ , ఆప్ ప్ర‌భుత్వం మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగింది. సిసోడియాతో పాటు 14 మంది ఉన్న‌తాధికారుల‌పై అభియోగాలు మోపింది.

తాజాగా ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ విచార‌ణ‌లో భాగంగా ప‌లు రాష్ట్రాల‌లో 36 చోట్ల ఈడీ దాడులు చేప‌ట్టింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ విస్తృతంగా సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించింది.

ఇదిలా ఉండ‌గా దేశ రాజ‌ధానిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ , అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మ‌ధ్య రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న‌కు మ‌ద్యం పాల‌సీ కేసు కేంద్రంగా మారింది. హైద‌రాబాద్ , బెంగ‌ళూరు, చెన్నై స‌హా ప‌లు నగ‌రాల్లో దాడులు ప్రారంభించిన‌ట్లు ఈడీ(ED Raids) వెల్ల‌డించింది.

అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మం ద్వారా ఏర్పాటైన ఆప్ స‌ర్కార్ పై బీజేపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా గ‌తంలో ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ విచార‌ణ‌కు సిఫార‌సు చేశారు.

ఎల్జీ ఆదేశించ‌డంతో ద‌ర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున సోదాలు చేప‌ట్టింది. దీనిపై తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది ఆప్. ఎల్జీ కావాల‌ని త‌మ‌పై క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు ఆప్ చీఫ్‌,

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. త‌న ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు కేంద్రం య‌త్నిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : భార‌తీయ విద్యార్థుల‌కు షాక్

Leave A Reply

Your Email Id will not be published!