Heeraben Prayer Meet : హీరా బెన్ మోదీ జ్ఞాపకం పదిలం
నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు
Heeraben Prayer Meet : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ తల్లి హీరా బెన్ ఇటీవలే కన్నుమూశారు. అత్యంత సాధారణంగా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం ప్రధాని తల్లి హీరా బెన్ మోదీ(Heeraben Prayer Meet) జ్ఞాపకార్థం గుజరాత్ లో ప్రార్థనా సమావేశం చేపట్టారు.
చిన్నతనంలో అష్టకష్టాలు పడ్డారు. పిల్లలను చదివించేందుకు ఇల్లిల్లు తిరిగి అంట్లు శుభ్రం చేశారు. ఆమె 99 ఏళ్ల పాటు జీవించారు. ఎవరిపై ఆధారపడలేదు. చివరి దాకా తన పనులు తానే చేసుకున్నారు. 100 ఏళ్ల వయస్సులో కాలం చేశారు. ఈ లోకాన్ని వీడారు. అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ లో తుది శ్వాస విడిచారు.
ఇందులో భాగంగా సమావేశం చేపట్టారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హీరా బెన్ మోదీకి నివాళులు అర్పించేందుకు, ఆమెతో తమకు కలిగిన అనుబందాన్ని గుర్తు చేసుకునేందుకు తరలి వస్తున్నారు(Heera Ben Prayer Meet). ఇప్పటికే అక్కడికి పలువురు చేరుకున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు హీరాబెన్ జ్ఞాపకార్థం ప్రారంభమైంది.
మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తన తల్లి హీరా బెన్ ను స్మరించుకున్నారు. మహిమ కలిగిన శతాబ్దం దేవుని పాదాల వద్ద ఉంది. మాలో త్రిమూర్తుల కర్మ యోగిని ప్రయాణాన్ని కలిగి ఉన్నారంటూ పేర్కొన్నారు. నిస్వార్థ కర్మ యోగి , విలువలకు కట్టుబడిన జీవితమని కొనియాడారు.
హీరా బెన్ కు చెందిన కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు.
Also Read : కొత్త ఏడాది బాగుండాలి