Akhilesh Yadav : యూపీలో ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగానే ఎగ్జిల్ పోల్స్ ప్రకారమే వచ్చాయి. యోగి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ మరోసారి పవర్ లోకి వచ్చింది.
రైతులపై దాడులు, నిరుద్యోగులు, జాట్స్ , దళితులు, బీసీలు, ఇతర కులాల వారు సమాజ్ వాది పార్టీ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా ఊహించని రీతిలో 270కి పైగా ఓట్లు సాధించింది.
ఎవరి సహకారం లేకుండానే ఒంటరిగానే అధికారాన్ని చేపట్టనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
తమకు సీట్లు తగ్గినా ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందన్నారు. గతంలో కంటే ఈసారి పెరిగినందుకు ఈ సందర్భంగా తమను నమ్మి ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు అఖిలేష్ యాదవ్.
ఒక రకంగా తాము అనుకున్నట్లు గానే ఓట్ల శాతాన్ని బీజేపీకి తగ్గించ గలిగామని చెప్పారు. రాష్ట్ర ఓటర్లు తమ సీట్ల సంఖ్యను రెండున్నర రెట్లు పెంచడం, వారి ఓట్ల వాటాలో ఒకటిన్నర రెట్లు పెరిగిందన్నారు.
చిన్నపాటి తేడాతో భారీ ఎత్తున తమ పార్టీ కూటమి అసెంబ్లీ సీట్లను కోల్పోయామని పేర్కొన్నారు. ఏది ఏమైనా తాము ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.
ఇక నుంచి యోగికి చుక్కలు చూపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav). విచిత్రం ఏమిటంటే 2017లో 317 గెలుచుకోగా 2022 లో 273 స్థానాలు గెలుచుకుంది.
దీంతో గతంలో కంటే 49 సీట్లు తగ్గాయి. సమాజ్ వాది పార్టీ 111 సీట్లు గెలుచుకుంది. కూటమితో కలుపుకుని 125 సీట్లు సాధించింది.
Also Read : విజయ గర్వం ప్రమాదకరం – రౌత్