Munugodu Independents : సత్తా చాటిన ఇండిపెండెంట్లు
43 మంది అభ్యర్థులకు 13,618 ఓట్లు పోల్
Munugodu Independents : మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. 11 వేల భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ విజయం సాధించింది. పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున హామీలు కూడా ఇచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు మినహా మిగతా పార్టీలు, స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికీ డిపాజిట్లు దక్కలేదు.
కానీ ప్రధాన పార్టీలను ప్రభావితం చేశాయి. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ కావాలని స్వతంత్రులను బరిలోకి దించిందని మండిపడ్డారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి శంకరాచారికి ఊహించని రీతిలో ఓట్లు రావడం విశేషం. ఎక్కడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు.
ఉప ఎన్నికల్లో మొత్తం 47 మంది పోటీ చేశారు. మొత్తం 13,618 ఓట్లు పోల్ అయ్యాయి. విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన శంకరాచారి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. ఆయనకు 4145 ఓట్లు వచ్చాయి(Munugodu Independents). కాంగ్రెస్ తర్వాత నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఇక ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ కు 805 ఓట్లు వచ్చాయి.
యుగ తులసి పార్టీ నుంచి బరిలో ఉన్న శివకుమార్ కు 1874 ఓట్లు పోల్ అయ్యాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ నుంచి పోటీ చేసిన మారమోని శ్రీశైలం యాదవ్ 2407 ఓట్లు సాధించారు. దళిత శక్తి పార్టీ నుంచి బరిలో ఉన్న ఏర్పుల గాలయ్యకు 2270 ఓట్లు వచ్చాయి. డీఎస్పీ చీఫ్ విశారదన్ సపోర్ట్ చేశారు.
నోటాకు 480 ఓట్లు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా వారిలో రాజేందర్ ఇస్లావత్ కు 502, లింగిడి వెంకటేశ్వర్లుకు 511 ఓట్లు వచ్చాయి.
Also Read : గులాబీ దళపతిదే హవా