India 2nd Largest : రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
2075 నాటికి అమెరికాను అధిగమించే చాన్స్
India 2nd Largest : అమెరికాకు కోలుకోలేని షాక్ . అది భారత దేశం రూపంలో రావడం విస్తు పోయేలా చేసింది. 2075 నాటికి భారత్ అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతి పెద్ద(India 2nd Largest) ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని గోల్డ్ మన్ సాచ్స్ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా యుఎస్ ఆశ్చర్యానికి గురైంది.
ఈ మేరకు సోమవారం తన నివేదికను ప్రకటించింది. జనాభా, ఆవిష్కరణ, సాంకేతికతలో దేశం పురోగతి , అధిక మూల ధన పెట్టుబడి , పెరుగుతున్న కార్మికుల ఉత్పాదకత దీనికి కారణమని స్పష్టం చేసింది. భారత్ తో పాటు జపాన్ , జర్మనీ , యూఎస్ కూడా ఎకానమీ పరంగా దూసుకు పోతాయని పేర్కొంది నివేదిక.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రపంచంలో జర్మనీ, జపాన్, చైనా, యుఎస్ తర్వాత భారత దేశం ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. రాబోయే రెండు దశాబ్దాలలో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో భారత దేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్ప ఉండబోతోందని అంచనా వేశారు గోల్డ్ మన్ సాక్స్ రీసెర్చ్ భారత దేశ ఆర్థిక వేత్త శాంతను సేన్ గుప్తా.
ఇక 2075 నాటికి జీడీపీ అంచనాలు చైనా 57, భారత్ 52.5 , యుఎస్ 51.5 , యూరో 30.3 , జపాన్ 7.5 ట్రిలియన్లుగా ఉండగలరని పేర్కొన్నారు. మొత్తంగా మీద భారత్ కు ఈ వార్త మంచి బూస్ట్ ను కలిగించనుంది.
Also Read : CM YS Jagan : పరిశ్రమల ఏర్పాటుతో భారీ ఉపాధి
