India Abstains : రష్యాపై ఓటింగ్ లో భారత్ గైర్హాజరు
ఉక్రెయిన్ పై రష్యా చట్ట విరుద్దమైన వార్
India Abstains : ఉక్రెయిన్ పై రష్యా చట్ట విరుద్దమైన దాడుల్ని నిరసిస్తూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా, అల్బేనియా ప్రవేశ పెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ గైర్హాజరైంది.
రష్యా చట్ట విరుద్దమైన ప్రజాభిప్రాయ సేకరణ , నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకించింది. ఇందుకు సంబంధించి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ముసాయిదా తీర్మానం సమర్పించింది. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ దూరంగా ఉంది భారత్(India Abstains). అంతే కాకుండా హింసను తక్షణమే నిలిపి వేయాలని పిలుపునిచ్చింది.
15 దేశాలతో కూడిన యుఎన్ భద్రతా మండలి యుఎస్, అల్బేనియాచే సమర్పించిన ముసాయిదా తీర్మానంపై ఓటు వేసింది. రష్యా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ సరహిద్దుల్లోని ప్రాంతాలలో చట్ట విరుద్దంగా ప్రజాభిప్రాయ సేకరణను పూర్తిగా ఖండించింది.
రష్యా తాత్కాలిక నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ కు చెందిన లుహాన్స్ , డోనెట్క్స్ , ఖెర్సన్ , జపోరిజ్జియా ప్రాంతాలలో ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుండి 27 వరకు చట్ట విరుద్దమైన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.
రష్యా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందడంలో విఫలమైంది. 15 దేశాల కౌన్సిల్ లో 10 దేశాలు తీర్మానానికి ఓటు వేయగా చైనా, గాబన్, ఇండియా, బ్రెజిల్ గైర్హాజరయ్యాయి. ఓటుకు సంబంధించి యుఎన్ లోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు.
ఉక్రెయిన్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో భారత దేశం తీవ్రంగా కలత చెందిందని అన్నారు. మానవ ప్రాణాలను పణంగా పెట్టి ఎటువంటి పరిష్కారం లభించదని స్పష్టం చేశారు.
Also Read : త్రివిధ దళాధిపతి రాకతో చైనా అలర్ట్