India Gives UNRWA : పాలస్తీనా శరణార్థుల కోసం భారత్ సాయం
యుఎన్ ఏజెన్సీకి $2.5 మిలియన్ల సపోర్ట్
India Gives UNRWA : భారత దేశం తన ఉదారతను చాటుకుంటోంది. ఇందులో భాగంగా పాలస్తీనా శరణార్థులను ఆదుకునేందుకు గాను యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీకి భారత దేశం $2,5 మిలియన్ల సాయాన్ని(India Gives UNRWA) అందజేసింది. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపశమనం , సామాజిక సేవలతో సహా ఏజెన్సీ ప్రధాన కార్యక్రమాలు, సేవలకు ఇది మద్దతు ఇస్తుందని రమల్లా లోని భారత ప్రతినిధి కార్యాలయం వెల్లడించింది.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నియర్ ఈస్ట్ లోని పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యుఎన్ఆర్ డబ్ల్యూఏ)కి భారత దేశం సోమవారం 2.5 మిలియన్ల డాలర్లను రెండవ విడత సహాయాన్ని అందించింది.
విద్య, వైద్య సంరక్షణ, రిలీఫ్ , సోషల్ సర్వీసెస్ తో సహా ఏజెన్సీ ప్రధాన కార్యక్రమాలు, సేవలకు ఈ మొత్తం ఖర్చు చేస్తారని వెల్లడించింది. పాలస్తీనా లోని రమల్లాలో ఉన్న భారత ప్రతినిధి కార్యాలయంలో యుఎన్ ఆర్ డబ్ల్యూఏ , విదేశీ సంబంధాల విభాగం, అసోసియేట్ డోనర్ రిలేషన్స్ , ప్రాజెక్ట్స్ ఆఫీసర్ మిస్ క్సురాన్ వూకి ఆర్థిక సహకారం అందించ బడుతుందని వెల్లడించింది.
ఇంతకు ముందు లెబనాన్ లోని పాలస్తీనా శరణార్థులు తిరిగి రాని స్థితికి చేరుకున్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా పేదరికం, నిరుద్యోగం, నిరాశ అధిక మోతాదులో ఉన్నాయి. లెబనీస్ ప్రజలు, సిరియన్ , పాలస్తీనా శరణార్థులను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి.
2020లో బీరుట్ లో పేలుడు, కోవిడ్ -19 మహమ్మారి , పేలవమైన పాలన, ప్రాథమిక సేవలలో దాదాపు మొత్తం పతనానికి కారణమైంది పాలస్తీనా.
Also Read : ది వైర్ ఎడిటర్ల ఇళ్లపై ఖాకీల దాడులు