India Alliance : ఇండియా కూటమి సమన్వయ కమిటీ
13 మందితో ఏర్పాటు
India Alliance : ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 13 మందిని ఎంపిక చేసింది. ముంబై వేదికగా జరిగిన ఇండియా కూటమి(India Alliance) కీలక భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సమన్వయ కమిటీలో చోటు దక్కిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణు గోపాల్ , ఎన్సీపీ నుంచి శరద్ పవార్ , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ను ఎంపిక చేసింది ఇండియా కూటమి.
India Alliance Viral
వీరితో పాటు టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ, శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ , ఆర్జేడీ అగ్ర నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ , జేడీయూ నుంచి లలన్ సింగ్ లను ఎంపిక చేసింది కూటమి.
వీరితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, జార్ఱండ్ ముక్తీ మోర్చా చీఫ్ , సీఎం హేమంత్ సోరేన్ , సమాజ్ వాది పార్టీ నుంచి జాదవ్ అలీ ఖాన్ , సీపీఐ నుంచి డి. రాజా , నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ పార్టీ నుంచి మెహబూబా ముఫ్తీని ఎంపిక చేసింది ఇండియా కూటమి.
ఇదిలా ఉండగా ఇండియా కూటమికి సంబంధించి సోనియా గాంధీని చైర్ పర్సన్ గా లేదా కన్వీనర్ గా నియమిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఎవరికీ అభ్యంతరం లేకుండా అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరికీ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు.
Also Read : India Alliance Comment : ఇండియా కూటమి సమర శంఖం