India Condemns : పాకిస్తాన్ ఆక్రమితక కాశ్మీర్ లో అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ పర్యటించారు. ఆమె పర్యటించడాన్ని భారత్ తీవ్రంగా తప్పు పట్టింది. సీరియస్ గా ఖండించింది. రాజకీయాలు చేయాలని అనుకుంటే ఇది సరైన ప్లేస్ కాదు.
ప్రతి దేశానికి కొన్ని పద్దతులు, విదేశాంగ విధానం, పరిమితులు ఉంటాయని పేర్కొంది. ఇది ఆమెకు వ్యాపారం కావచ్చు. కానీ దాని ముసుగులో తమ దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడం మాత్రం తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం(India Condemns) చేసింది.
ఈ మేరకు అమెరికాకు , ఇల్హాన్ ఒమర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేసింది. యుఎస్ కాంగ్రెస్ మహిళా సభ్యురాలు నాలుగు రోజుల పాటు పాకిస్తాన్ లో ఉన్నారు.
ఈనెల 20 నుంచి పాక్ లో నే ఉన్నారు. ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ , షెహబాజ్ షరీఫ్ ను కూడా కలిశారు. ఆమె పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పర్యటించడాన్ని తప్పు పట్టారు.
పాకిస్తాన్ సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక సామర్థ్యాలపై మరింత అవగాహన కోసం ఆమె లాహోర , ఆజాద్ జమ్మూ కాశ్మీర్ లోను సందర్శిస్తారని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఇటీవల తన పదవి కోల్పోవడానికి అమెరికా కారణమంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. ఈ తరుణంలో దెబ్బతిన్న సంబంధాలను పెంపొందించే క్రమంలో ఆమె ఈ టూర్ పెట్టుకున్నారు. ప్రస్తుతం భారత్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : జహంగీర్ పూరి కూల్చివేతలపై సుప్రీం ఆగ్రహం