India: చీనాబ్ నదిపై రెండు డ్యామ్‌ల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్న భారత్‌

చీనాబ్ నదిపై రెండు డ్యామ్‌ల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్న భారత్‌

India : పహల్గాం ఉగ్రదాడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన పాకిస్తాన్ పై… భారత్‌ సైలెంట్‌ గా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. పాకిస్తాన్ కు నీరు అందించే బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నీటిని ఇప్పటికే ఆపేయగా… తాజాగా సలాల్‌ డ్యామ్‌ ను కూడా మూసివేసింది. అంతేకాదు… ఈ రెండు హైడ్రోపవర్‌ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో… దీనికి సంబంధించిన సమాచారాన్ని పాక్‌ కు వెల్లడించలేదు. తొలిసారి ఆ ఒప్పందానికి భిన్నంగా భారత్‌(India) తీసుకొన్న తొలి చర్యగా నిపుణులు చెబుతున్నారు.

India Creates Water Shortage to Pakistan

గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్‌ లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్‌ ప్రక్రియను మొదలుపెట్టింది. దాదాపు మూడు రోజులపాటు ఇది కొనసాగింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ చూసుకొంటోంది. కాకపోతే పాక్‌ కు ఇప్పటికిప్పుడు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాకపోయినా… భవిష్యత్తులో మాత్రం సమస్యలు ఎదురుకావచ్చని నిపుణులు చెబుతున్నారు. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిల్లో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్‌కు నీటి కరవు తప్పదు. సలాల డ్యామ్‌ ను 1987లో… బాగ్‌ లిహార్‌ను 2009లో ప్రారంభించారు.

అయితే ఈ డ్యామ్‌ లలో చేపట్టిన పనుల గురించి, ప్రభుత్వం లేదా ఎన్‌హెచ్‌పీసీ స్పందించడం లేదు. ఇక బురదను, నీటిని బయటకు పంపే ఫ్లషింగ్‌ ప్రక్రియ కారణంగా విద్యుత్తును మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేసే అవకాశంతో పాటు… టర్బైన్‌ దెబ్బతినకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడంతో… పాక్‌ కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్‌ కు లేదు. మన ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోవచ్చని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ మాజీ అధిపతి కుష్వీందర్‌ వోహ్రా పేర్కొన్నారు.

ఇక ఈ ఒప్పందాన్ని భారత్‌(India) నిలిపివేస్తే… ఎదుర్కొనేందుకు పాక్‌ వద్ద పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఒప్పందానికి మధ్యవర్తి అయిన ప్రపంచ బ్యాంక్‌ వద్దకు వెళ్లడం తప్ప మిగిలిన వాటివల్ల దానికి పెద్దగా ప్రయోజనం లేదు. వరల్డ్‌ బ్యాంక్‌ కు చట్టబద్ధమైన పాత్ర ఏమీ లేదు. అంతేకానీ ఒప్పందాన్ని అమలుచేసే అధికారం లేదు. ఏమైనా అభిప్రాయభేదాలు వస్తే… చర్చలకు మాత్రమే ప్రోత్సహించగలదు. తటస్థ నిపుణుల నియామకం, కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఛైర్మన్లను నియమించడం వరకే దాని పాత్ర పరిమితం.

పాకిస్తాన్ కు అప్పు ఇవ్వొద్దు – ఏడీబీకు నిర్మలా సీతారామన్‌ విజ్ఞప్తి

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్‌ పై భారత్‌ ఫైనాన్షియల్‌ స్ట్రైక్‌ చేస్తోంది భారత్‌. ఇప్పటికే ఐఎంఎఫ్‌ తలుపు తట్టిన ప్రధాని మోదీ సర్కార్‌ తాజాగా, ఇటలీలో ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ను సంప్రదించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ కు రుణాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఏడీబీ వార్షిక సమావేశం కోసం ఇటలీకి వెళ్లిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంక్‌ చీఫ్‌ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పాకిస్తాన్‌ కు ఇస్తున్న ఏడీబీ రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదేశానికి అప్పిస్తే… ఆ సొమ్ము మొత్తం ఉగ్ర సంస్థల ఖాతాల్లోకి వెళుతోందని వివరించారు. ఏడీబీ చీఫ్‌తో పాటు, ఇటలీ ఆర్థిక మంత్రి జియాన్‌కార్లో గియోర్గెట్టితో కూడా ప్రత్యేక సమావేశమయ్యారు. పాకిస్తాన్‌కు ఇచ్చే నిధుల విషయంలో పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, మే 4 నుండి 7 వరకు జరగనున్న ఆసియా అభివృద్ధి బ్యాంకు గవర్నర్ల బోర్డు 58వ వార్షిక సమావేశంలో సీతారామన్ ఇటాలి మిలాన్‌లో పర్యటిస్తున్నారు. గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశానికి నిర్మలా సీతారామన్‌ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

Also Read : Polavaram Project: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం

Leave A Reply

Your Email Id will not be published!