India Dismisses : శ్రీలంకకు సైన్యాన్ని పంపలేదు – భారత్
ఆ వార్తలన్నీ అవాస్తవమని ప్రకటన
India Dismisses : శ్రీలంకలో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశ అధ్యక్షుడు గోటబోయ రాజపక్సే , ప్రధాన మంత్రి రణిలే విక్రమ సింఘే తమ పదవులకు రాజీనామా చేశారు.
దీంతో రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ కొత్తగా ప్రభుత్వం కొలువు తీరేంత వరకు దేశ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ తరుణంలో విపక్షాలన్నీ కలిసి తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు.
నెల రోజుల దాకా స్పీకర్ చీఫ్ గా ఉండనున్నారు. నిరసనకారులు మాత్రం దేశ అధ్యక్షుడి భవనంలోనే ఉన్నారు. పీఎం ఇంటికి నిప్పు పెట్టారు. ఆయనకు సంబంధించిన వాహనాలు ధ్వంసం చేశారు.
ఇక 1948 లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆహారం, ఆయిల్, విద్యుత్, గ్యాస్ కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విపత్కాల సమయంలో భారత దేశం వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది.
ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం(India Dismisses) సైన్యాన్ని పంపించిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీరియస్ గా స్పందించింది భారత ప్రభుత్వం. సంక్షోభం ఆ దేశానికి సంబంధించిన అంశమని, తాము జోక్యం చేసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ప్రజల మూకుమ్మడి దాడితో దెబ్బకు రాజభవనం నుంచి పారి పోయాడు ప్రెసిడెంట్ గోటబోయ రాజపక్సే.
సైన్యాన్ని పంపలేదని అయితే శ్రీలంక ప్రజలకు ప్రజాస్వామ్య మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు తాము అండగా ఉంటామని స్పష్టం చేసింది కేంద్ర సర్కార్.
Also Read : గుజరాత్ లో భారీ వర్షాలు.. రోడ్లు చెరువులు అయ్యాయి