Donald Lu : భారత దేశంలో మీడియా సూపర్ – లూ
మెచ్చుకున్న అమెరికా సెక్రటరీ
Donald Lu : అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డోనాల్డ్ లూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో మీడియాకు అపరిమితమైన స్వేచ్ఛ ఉందని, ఇక్కడ సూపర్ గా పని చేస్తోందంటూ కితాబు ఇచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది అత్యంత శక్తివంతమైన సాధనంగా మారిందన్నారు. ప్రధానంగా అత్యున్నతమైన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జర్నలిస్టులు చేస్తున్న కృషి , పాత్ర అద్భుతమని పేర్కొన్నారు డొనాల్డ్ లూ.
భారత దేశానికి ఉచిత ప్రెస్ ఉందని, ఇది నిజంగా పని చేస్తుందన్నారు. 142.86 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. దేశంలోని పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడంలో జర్నలిస్టుల పాత్రను యుఎస్ ఉన్నతాధికారి ఒకరు ప్రశంసించారు.
దక్షిణ, మధ్య ఆసియాకు సంబంధించిన యుఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డోనాల్డ్ లూ(Donald Lu) శనివారం మాట్లాడారు. భారత దేశంలో రహస్యంగా ఉంచబడింది ఏమీ లేదన్నారు. మీకు భారత దేశం కొంత ప్రజాస్వామ్యంగా ఉందన్నారు.
ఎందుకంటే మీకు నిజంగా పని చేసే స్వేచ్చా మీడియా ఉందని తెలిపారు డోనాల్డ్ లూ. భారత ప్రజాస్వామ్యానికి మద్దతుగా జర్నలిస్టుల పాత్రను, వారు చేస్తున్న కృషిని డోనాల్డ్ లూ ప్రశంసించారు. అమెరికా సెక్రటరీ డోనాల్డ్ లూ చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : $226 మిలియన్లు అందుకున్న పిచాయ్