India Invite Pak : పాక్ విదేశాంగ మంత్రికి భార‌త్ ఆహ్వానం

మేలో జ‌ర‌గ‌నున్న ప్రాంతీయ స‌మావేశం

India Invite Pak : ఇరు దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న త‌రుణంలో భార‌త దేశం ఓ అడుగు ముందుకేసింది. వ‌చ్చే మే నెల‌లో భార‌త్ లో జ‌రిగే ప్రాంతీయ స‌మావేశానికి రావాల్సిందిగా పాకిస్తాన్ ను ఆహ్వానించింది. ఇదిలా ఉండ‌గా నెల రోజుల కింద‌ట ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావ‌ల్ భుట్టో జ‌ర్దారీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

పెద్ద ఎత్తున ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని హిందూ వ‌ర్గాలు డిమాండ్ చేశాయి. ఈ త‌రుణంలో భార‌త్ వాట‌న్నింటినీ ప‌ట్టించుకోకుండా భుట్టోకు రావాల‌ని కోరింది. ఒక వేళ పాకిస్తాన్ గ‌నుక అంగీక‌రిస్తే 12 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశంలో ప‌ర్య‌టించిన తొలి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రిగా బిలావ‌ల్ భుట్టో నిలిచి పోతారు.

కాగా మేలో షాంఘై స‌హ‌కార సంస్థ (ఎస్సీఓ) కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం పాకిస్తాన్ ను(India Invite Pak) కూడా ఆహ్వినించింది భార‌త్. ప్ర‌స్తుతం భార‌త దేశం జీ20 గ్రూప్ కు సార‌థ్యం వ‌హిస్తోంది. కాగా ఇస్లామాద్ ఇంకా నిర్ణ‌యం తీసుకోన‌ప్ప‌టికీ త‌మ విదేశాంగ శాఖ మంత్రి బిలావ‌ల్ భుట్టో జ‌ర్దారీకి ఆహ్వానం అందింద‌ని పాకిస్తాన్ వ‌ర్గాలు ధ్రువీక‌రించాయి.

నెల రోజుల కింద‌ట ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి స‌మావేశంలో ప్ర‌ధాని మోదీని ఉద్దేశించి బిలావ‌ల్ భుట్టో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న కామెంట్స్ ను భార‌త ప్ర‌భుత్వం అనాగ‌రికం అని పేర్కొంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది.

Also Read : గ‌ణ‌తంత్ర దినోత్స‌వం ప్ర‌త్యేకం

Leave A Reply

Your Email Id will not be published!