PM Modi G20 : శాంతి ప్ర‌క్రియ‌కు భార‌త్ సిద్దం – మోదీ

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చ‌ర్చ‌లు జ‌ర‌పండి

PM Modi G20 Meet :  ఉక్రెయిన్, ర‌ష్యా దేశాలు మంకుప‌ట్టు వీడాల‌ని పిలుపునిచ్చారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. గురువారం న్యూ ఢిల్లీలో జ‌రిగిన జీ20 విదేశాంగ శాఖ మంత్రుల స‌మావేశంలో ప్ర‌ధాని పాల్గొని(PM Modi G20 Meet)  ప్ర‌సంగించారు. ఏడాది పూర్త‌యింది. అటు ఉక్రెయిన్ త‌గ్గ‌డం లేదు. ఇటు ర‌ష్యా ప‌ట్టించు కోవ‌డం లేదు. ఇది ప్ర‌పంచానికి మంచిది కాద‌న్నారు న‌రేంద్ర మోదీ. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనాల‌ని సూచించారు.

శాంతి మార్గం త‌ప్ప ఇంకేదీ లేద‌న్నారు. ఇరు దేశాలు ఒప్పుకుంటే భార‌త్ అందుకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించేందుకు సిద్దంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. త‌మ‌కు ఆధిప‌త్యం కావాల‌ని కోరువ‌డం లేద‌న్నారు. తాము ముందు నుంచీ త‌టస్థ వైఖ‌రిని అవ‌లంభిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి. ఉక్రెయిన్ సంక్షోభంపై ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

ఉక్రెయిన్ , ర‌ష్యా దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్దం కార‌ణంగా చాలా దేశాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు న‌రేంద్ర మోదీ. ఉక్రెయిన్ వివాదానికి ప‌రిష్కారం క‌నుగొనే శాంతి ప్ర‌క్రియ‌కు స‌హ‌క‌రించేందుకు తాము సిద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు పీఎం. ఇటలీ ప్ర‌ధాని జార్జియాతో ద్వైపాక్షిక చ‌ర్చ‌ల అనంత‌రం న‌రేంద్ర మోదీ(PM Modi G20 Meet)  ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ కీల‌క‌మైన దేశాధినేత‌లు ఇక్క‌డ కొలువు తీరారు.

ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ లో శ‌త్రుత్వాల విర‌మ‌ణ ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేయ‌డం, చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంలో భార‌త దేశం జి20 చీఫ్ గా ఉన్న స‌మ‌యంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంద‌ని ఇటలీ భావిస్తున్న‌ట్లు పీఎం మెలోనీ చెప్పారు.

Also Read : నిర్ణ‌యాలలో లోపం ప్ర‌పంచానికి శాపం

Leave A Reply

Your Email Id will not be published!