Ruchira kamboj : ఆఫ్గనిస్తాన్ తీవ్రవాదులపై భారత్ ఆందోళన
బీజేపీ నాయకులకు అక్కడి నుంచే బెదిరింపు
Ruchira kamboj : ఆఫ్గనిస్తాన్ వేదికగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదుల నుంచే ఎక్కువగా ముప్పు ఉందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది
భారత్. ఐక్య రాజ్య సమితిలో ఇవాళ భారత దేశ శాశ్వత ప్రతినిధి (రాయబారి) రుచిరా కాంబోజ్(Ruchira kamboj) ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆమె ఇటీవల కొలువు తీరారు. తను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉగ్రవాద చర్యలను నిరసిస్తున్నారు. భారత దేశం యుద్ధాన్ని కోరుకోదని శాంతిని మాత్రమే కోరుకుంటుందన్నారు.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆఫ్గనిస్తాన్ ఉగ్రవాదులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అంతే కాదు ఎక్కడున్నా వారి తలలు తీసి వేస్తామంటూ హెచ్చరించారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు శాశ్వత ప్రతినిధి. విచిత్రం ఏమిటంటే ఎక్కువగా ఆఫ్గనిస్తాన్ కు చెందిన తీవ్రవాద గ్రూపులే వీరిని లక్ష్యంగా చేసుకున్నాయంటూ మండిపడ్డారు.
కాంబోజ్ ఆఫ్గనిస్తాన్ పై భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు. లష్కరే తయ్యబా , జైష్ ఎ మహ్మద్ , ఇస్లామిక్ స్టేట్ తో సహా ఆఫ్గనిస్తాన్ నుండి పని చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూపులు శాంతికి ముప్పు కలిస్తున్నాయంటూ మండిపడ్డారు.
తాలిబన్ సెటప్ ద్వారా బలమైన చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు రుచిరా కాంబోజ్. ఉగ్రవాదుల నిర్వాకం వల్ల ప్రపంచానికే పెద్ద ముప్పు ఏర్పడుతుందన్నారు రుచిరా కాంబోజ్. విపత్కర పరిస్థుతుల్లో అన్ని దేశాలు ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Also Read : భారత్ తో బంధానికి విదేశాలు ఆసక్తి