Third Largest Economy : ఆర్థిక రంగంలో భారత్ భళా
ఐదో ఆర్థిక వ్యవస్థగా రికార్డ్
Third Largest Economy : భారత దేశం మరో మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇందులో భాగంగా వరల్డ్ లో ఇప్పటి వరకు ఉన్న బ్రిటన్ ను నెట్టి వేసింది.
చరిత్ర సృష్టించింది. 2030 సంవత్సరం నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా(Third Largest Economy) అవతరించనుందని ఆర్థికరంగ నిపుణులు పేర్కొంటున్నారు. అన్ని రంగాలలో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది.
భారత దేశం పవర్ స్కేల్ ను పెంచుతోంది. 2028 – 2030 నాటికి ముందస్తు అంచనా ప్రకారం ప్రపంచంలో మరింత ముందుకు వెళ్లే అవకాశం భారత దేశానికి ఉందని అభిప్రాయపడ్డారు మాజీ చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ అరవింద్ విర్మణి.
ప్రధానంగా మన విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక రకంగా ఇండియన్ ఎకానమీకి బూస్ట్ లాంటిదని పేర్కొన్నారు. గత 20 , 30 సంవత్సరాలుగా మనం చైనా కంటే వెనుకబడి ఉన్నామని ప్రజలు భావిస్తూ వచ్చారు.
ఆ దేశంతో పోటీ పడాలన్న బలీయమైన కోరిక కలగడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇది ఆశాజనక అవగాహనను కలిగిస్తుందన్నారు.
ఆర్థికంగా బ్రిటన్ ను నెట్టి వేయడం భారత దేశానికి ఇది రెండోసారి కావడం విశేషం. మొదటిసారి 2019లో చోటు చేసుకుంది ఇదే సన్నివేశం. ప్రస్తుతం మూల ధనంపై ఫోకస్ పెడుతున్నాం.
ఆదాయ వ్యయాలను తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ద్రవ్యోల్బణ లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యూహం కూడా ఆర్థిక వ్యవస్థకు సహాయ పడిందని పేర్కొన్నారు డీజీ సచిన్ చతుర్వేది.
ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉంటే భారత దేశంలో మాత్రం ఆర్థిక వ్యవస్థ మరింత ఆశాజనకంగా ఉండడం విస్తృత చర్చకు దారితీసింది.
Also Read : విక్రాంత్ లో ప్రయాణం మోదీ ఉద్వేగం