India MPs Protest : ప్రతిపక్షాలకు చెందిన ఇండియా ఎంపీల నిరసన(India MPs Protest) ఢిల్లీలో కొనసాగుతోంది. మణిపూర్ హింసపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి నిరవధికగా ఆందోళన చేపట్టారు. ప్రధానంగా మోదీ ఎందుకు మాట్లాడడం లేదంటూ పదే పదే ప్రశ్నించారు , నిలదీశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీని పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
India MPs Protest Raising Voice
మణిపూర్ లో ఎందుకు ప్రశ్నించ కూడదని నిలదీశారు ప్రతిపక్షాల ఎంపీలు. సభ్యులంతా మూకుమ్మడిగా ఎంపీ సంజయ్ సింగ్ కు మద్దతుగా నిలిచారు. శుక్రవారం పార్లమెంట్ భవనం ఆవరణలోని చెట్టు కింద నిరసన వ్యక్తం చేశారు. 85 రోజులు కావస్తోంది మణిపూర్ అగ్ని గోళంలా మండుతున్నా మౌనం వహించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఎంపీలు.
సంజయ్ సింగ్ కు బేషరతుగా మద్దతు తెలిపిన వారిలో సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే , బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కే కేశవరావు ఉన్నారు. ఇదిలా ఉండగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా నిప్పులు చెరిగారు. పార్లమెంట్ చట్టాలను ఉల్లంఘిస్తూ బిల్లులు తీసుకు వచ్చారంటూ ఆరోపించారు.
Also Read : Blue Whale AP : కొట్టుకు వచ్చిన నీలి తిమింగలం