Covid19 : కరోనా తగ్గుముఖం పట్టినా కేసుల సంఖ్య పెరుగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్రం అన్ని చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేసింది. తాజాగా కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొత్తగా గడిచిన 24 గంటల్లో 199 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. మౌలిక వసతులు , అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా(Covid19) నివారణకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.
కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటి వరకు గత రెండేళ్లుగా పరిణమించిన కరోనా మహమ్మారి కారణంగా చని పోయిన వారి సంఖ్య 5,31,836 మందికి చేరుకుంది. ఇక కరోనా సంక్రమించి చికిత్స పొందిన వారి సంఖ్య ఇప్పటి వరకు 4 కోట్ల 49 లక్షల మంది కావడం గమనార్హం. అంటే కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు చూస్తే 4,49,92,293 మంది అన్న మాట.
కాగా యాక్టివ్ కసుల పరంగా చూస్తే 2,831 నుండి 2,687కి తగ్గాయని కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. మొత్తం ఇన్ఫెక్షన్ల పరంగా చూస్తే 0.01 శాతం కాగా జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వ్యాధి కారణంగా ఎఫెక్టు అయి కోలుకున్న వారి సంఖ్య 4,44,57,720కి పెరగడం శుభ సూచకమని పేర్కొంది.
Also Read : CM YS Jagan : చెత్త రహిత రాష్ట్రంగా ఏపీ – సీఎం