India Sends Help Afghan : తల్లడిల్లిన ఆఫ్గాన్ కు భారత్ ఆసరా
పెద్ద ఎత్తున సహాయం..బయలు దేరిన బృందం
India Sends Help Afghan : తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్గనిస్తాన్ వైపు ఏ ఒక్క దేశం కన్నెత్తి చూడడం లేదు. నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ చెప్పుడు మాటలు విని భారత్ పై నోరు పారేసుకున్నా భారత దేశం ఎప్పటి లాగే తన ధర్మాన్ని మరిచి పోలేదు.
తన విదేశాంగ విధానాన్ని మార్చుకోలేదు. తాలిబన్లు తమ వైఖరి మార్చుకునేలా చేసింది భారత్ . ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో తాజాగా ఆఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది.
ఏకంగా 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎక్కువగానే ప్రాణ నష్టం సంభవించి ఉండవచ్చని అంచనా. వేలాదిగా ఇళ్లు, భవనాలు కూలి పోయాయి. భారీ ఎత్తున గాయపడ్డారు.
కానీ సాయం చేసేందుకు ఆఫ్గనిస్తాన్ తో వనరులు లేవు. వసతులు అంతకన్నా లేవు. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న ఆఫ్గన్లకు భారత దేశం(India Sends Help Afghan) తన వంతు సాయంగా గోధుమలను పంపించింది.
రెడ్ క్రాస్ సొసైటీ తన సేవలు ప్రారంభించింది. ఈ తరుణంలో ఉగ్రవాదం ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదని భారత్ స్పష్టం చేస్తూనే వచ్చింది.
తాజాగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆఫ్గనిస్తాన్(India Sends Help Afghan) ప్రభుత్వం చేసిన విన్నపానికి మొదటగా స్పందించింది భారత దేశం. ఈ మేరకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను విమానాల ద్వారా ఆఫ్గనిస్తాన్ కు పంపించింది.
ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు భారత దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరందిమ్ బాగ్చి. ట్విట్టర్ వేదికగా భారత్ చేస్తున్న సాయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా మానవతను చాటుకున్న భారత్ కు ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.
Also Read : వీడిన సిద్దూ కేసు మిస్టరీ లారెన్స్ సూత్రధారి
First consignment of India's earthquake relief assistance for the people of Afghanistan reaches Kabul. Being handed over by the Indian team there.
Further consignment follows. pic.twitter.com/6v1oYSRZLO
— Arindam Bagchi (@MEAIndia) June 23, 2022