India Slams : భుట్టో కామెంట్స్ భారత్ సీరియస్
370 రద్దు భారత్ అంతర్గత వ్యవహారం
India Slams : పాకిస్తాన్ తన తీరు మార్చు కోవడం లేదు. భారత్ పై గతంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ చేస్తే ప్రస్తుతం ఆయనను పడగొట్టి పవర్ లోకి వచ్చిన షెహబాజ్ షరీఫ్ సర్కార్ సైతం విషం కక్కుతోంది.
దీనిపై ఇప్పటికే భారత్ తీవ్ర(India Slams) అభ్యంతరం చెప్పింది. తాజాగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో యూఎన్ లో జమ్మూ కాశ్మీర్ అంశంపై లేవనెత్తారు. ప్రత్యేకంగా భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసింది.
దీంతో ఆనాటి నుంచి నేటి దాకా దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ ల మధ్య వైరం మరింత ముదిరింది. ఇప్పటికే ఇండియా(India Slams) సర్జికల్ స్ట్రైక్ చేసి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఇక భారత భద్రతా సలహాదారుడిగా, ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరొందిన అజిత్ దోవల్ ఎప్పుడైతే కొలువు తీరారో పాకిస్తాన్ ఆర్మీ జాగ్రత్త పడుతోంది. అంతే కాకుండా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ గా పేరొందిన దావూద్ ఇబ్రహీం తప్పించుకున్నాడు.
బయటకు రావడం లేదు. ఇదిలా ఉండగా ఐక్య రాజ్య సమితిలో బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం తమ అంతర్గత వ్యవహారమని భారత్ ప్రపంచానికి స్పష్టం చేసింది.
జమ్మూ కాశ్మీర్ పై అనవసరమైన వ్యాఖ్యలు చేసినందుకు పాకిస్తాన్ ను భారత్ తీవ్రంగా శుక్రవారం తప్పు పట్టింది. ఇంకోసారి భారత్ పై అనుచిత కామెంట్స చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.
జమ్మూ కాశ్మీర్ , లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు బారత దేశంలో అంతర్భాగం. విడదీయరాని భాగంగా ఉంటాయి. ఇందులో పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి.
వీటిని ఏరోజైనా భారత్ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది.
Also Read : ఉక్రెయిన్ కు పాక్ బిలియనీర్ సపోర్ట్