India Team Governor : గవర్నర్ ను కలిసిన ఇండియా కూటమి
వినతిపత్రం సమర్పించిన ఎంపీల బృందం
India Team Governor : ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆదివారం ఎంపీల బృందం మణిపూర్ గవర్నర్ ను కలుసుకున్నారు. ఇండియా టీం తరపున వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోసుకున్నా ఇప్పటి వరకు కంట్రోల్ కాలేదని పేర్కొన్నారు. వెంటనే అన్ని వర్గాలు సామరస్య పూర్వకంగా ఉండే వాతావరణం తీసుకు వచ్చేలా చేయాలని గవర్నర్(India Team Governer) ను కోరారు.
India Team Governor Request
కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కొలువుతీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమం చెందాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని, పునరావాసం కల్పించాలని సూచించారు. ఇప్పటికే మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, దారుణాల కారణంగా లెక్కకు మించి చని పోయారని , మరికొందరు లెక్కల్లోకి రాకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు తమకు అందిన సమాచారం మేరకు 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 300 మందికి పైగా గాయపడ్డారని, 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని వెల్లడించారు. 10 వేల మందికి పైగా సైనికులను మోహరించినా ఇప్పటి వరకు నియంత్రణలోకి రాలేదని వెంటనే స్పందించాలని సూచించారు.
ఇదిలా ఉండగా ఇండియా బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. బాధితులతో ముఖా ముఖి మాట్లాడతారు సభ్యులు. వారి అభిప్రాయాలను, సూచనలను తీసుకుంటారు. రాష్ట్రంలో ఎంత మంది బాధితులున్నారనే దానిపై పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది ఈ ఇండియా బృందం.
Also Read : Telangana Police Hats Off Comment : మానవత్వమా వర్ధిల్లుమా