Unemployment Rate : భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు
8.30 శాతానికి ఎగబాకిన వైనం
Unemployment Rate : గతంలో ఎన్నడూ లేని రీతిలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది దేశంలో. అచ్చే దిన్ ఆయేగా అంటూ పదే పదే చెబుతూ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓ వైపు ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తుండగా నిరుద్యోగ భూతం వెంటాడుతోంది.
మరో వైపు కరోనా భూతం మరోసారి గజగజ వణికిస్తోంది. ఓ వైపు చైనాను కమ్మేసింది కరోనా. గత రెండు సంవత్సరాలుగా కరోనా భారత దేశంపై పెను ప్రభావం చూపింది. ఇది అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. దీని కారణంగా ప్రధాన రంగాలన్నీ కుదలేయ్యాయి. ఉత్పాదకత తగ్గింది.
అదే సమయంలో పరిశ్రమలు మూత పడ్డాయి. ఎగుమతుల రంగం నిరాశకు గురి చేస్తోంది. ఈ క్రమంలో ఆర్బీఐ రెపో రేటు పెంచుకుంటూ పోతోంది. కానీ తగ్గించడం లేదు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరిస్తూనే వస్తున్నారు. ఆయన చెప్పింది అక్షరాల నిజమైంది.
కొత్త ఏడాది 2023 మొదటి రోజే బాంబు పేల్చింది. భారత దేశంలో నిరుద్యోగిత రేటు(Unemployment Rate) భారీ గా పెరిగింది. గడిచిన ఏడాది డిసెంబర్ లో నిరుద్యోగిత రేటు ఏకంగా 8.30 శాతానికి పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది.
ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. గత కొంత కాలం నుంచీ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నెత్తీ నోరు మొత్తుకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించు కోవడం లేదు.
Also Read : అద్దె కట్టని మస్క్ పై ఓనర్ దావా