INDIA Walk Out : రాజ్య‌స‌భ నుండి విప‌క్షాలు వాకౌట్

మ‌ణిపూర్ పై వీడ‌ని పీఎం మౌనం

INDIA Walk Out : కేంద్ర ప్ర‌భుత్వం మ‌ణిపూర్ పై మాట్లాడ‌క పోవ‌డాన్ని నిర‌సిస్తూ మంగ‌ళ‌వారం విప‌క్షాల స‌భ్యులు రాజ్య స‌భ నుండి వాకౌట్ చేశారు(INDIA Walk Out). ప‌ర‌స్ప‌ర చ‌ర్చ‌ల మోష‌న్ ఆధారంగా మ‌ణిపూర్ పై త‌క్ష‌ణ చ‌ర్చ‌కు అనుమ‌తించేందుకు స్పీక‌ర్ అనుమ‌తి నిరాక‌రించ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప ద‌ల్చుకున్నారో స్ప‌ష్టం చేయాల‌న్నారు ఎంపీలు.

INDIA Walk Out on Parliement

అంతే కాకుండా విపక్షాల కూట‌మికి చెందిన పార్టీల స‌భ్యుల‌ను అవ‌మానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ క్షమాప‌ణ‌లు చెప్ప‌క పోవ‌డాన్ని తీవ్రంగా ఖండించారు ఎంపీల త‌ర‌పున మాట్లాడిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్‌. ఇది పూర్తిగా నిరంకుశ ధోర‌ణితో ఉంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లుమార్లు తాము మ‌ణిపూర్ గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావించినా ఎందుక‌ని స్పందించ‌డం లేదో చెప్ప‌లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. అస‌లు ఈ దేశంలో మోదీ ఉన్నారా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ కేవ‌లం విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో పాల‌న సాగించాల‌ని అనుకోవ‌డం దారుణ‌మ‌న్నారు . ఇప్ప‌టి వ‌ర‌కు మోదీ ఎందుకు మ‌ణిపూర్ లో ప‌ర్య‌టించ లేదో చెప్పాల‌న్నారు. మ‌ణిపూర్ కు బాధ్య‌త వ‌హిస్తూ సీఎంను ఎందుకు బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. మ‌ణిపూర్ పై మాట్లాడేందుకు 80 రోజులు ఎందుకు తీసుకున్నార‌ని నిల‌దీశారు.

Also Read : Raghunandan Rao : గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం ఎన్నిక‌ల స్టంట్

Leave A Reply

Your Email Id will not be published!