Ajit Doval : భారత్ ఆఫ్గాన్ ప్రజలను వదులుకోదు – దోవల్
భారత జాతీయ భద్రతా సలహాదారు కామెంట్స్
Ajit Doval : భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్గనిస్తాన్ దేశంతో తమకు కొన్ని తరాల నుండి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఆ దేశ ప్రజలను ఎప్పటికీ వదులు కోబోమంటూ స్పష్టం చేశారు. ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ గత కొన్ని రోజులుగా విదేశాలలో పర్యటిస్తున్నారు.
ఇప్పటి వరకు అమెరికా, యూకేలలో పర్యటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను, ప్రత్యేకించి భద్రత గురించి చర్చించారు. అమెరికా దేశ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో పాటు యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా పీఎంతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అనంతరం రెండు రోజుల టూర్ నిమిత్తం రష్యాలోని మాస్కోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆఫ్గనిస్తాన్ అంశంపై ప్రత్యేకంగా ప్రస్తవించారు. ఈ మేరకు భారత్ ,ఆఫ్గనిస్తాన్ దేశాల మధ్య సంబంధం మరింత ధృఢంగా ఉంటుందన్నారు. మాస్కోలో జరిగిన ఆఫ్గనిస్తాన్ భద్రతా సమావేశంలో పాల్గొన్నారు అజిత్ దోవల్(Ajit Doval).
రష్యాతో పాటు భారత్ , ఇరాన్ , కజకిస్తాన్ , కిర్గిజ్తాన్ , తజికిస్తాన్ , తుర్కెనిస్తాన్ , ఉజ్బెకిస్తాన్ దేశాల నుండి భద్రతా అధికారులు హాజరయ్యారు ఈ కీలక సమావేశానికి. గతంలో ఇదే కీలక సమావేశం నవంబర్, 2021లో అజిత్ దోవల్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు అజిత్ దోవల్.
Also Read : గత పాలకుల నిర్వాకం అవినీతిమయం