Taliban Modi : నిన్నటి దాకా పాకిస్తాన్ తో దోస్తీ చేసి దానిని ఆకాశానికి ఎత్తేసిన ఆఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఉన్నట్టుండి భారత దేశం పట్లు మెతక వైఖరి అవలంభిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్గన్ ను ఏ దేశమూ ఇంత వరకు అధికారికంగా గుర్తించడం లేదు. దీంతో మానవతా దృక్ఫథంతో ఇండియా తీవ్ర ఇబ్బందుల్లో, ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆఫ్గినిస్తాన్ కు పెద్ద ఎత్తున గోధుమలను ఎగుమతి చేసింది.
ఎలాంటి ఖర్చు లేకుండానే భారత్ తాలిబన్లకు సాయం చేసింది. భారత్ తో పాటు పలు దేశాలు తోచిన రీతిలో సాయం చేస్తున్నాయి. తాలిబన్లు ఆక్రమించు కోవడంతో ఆఫ్గనిస్తాన్ పై ఆర్థిక ఆంక్షలు మొదలయ్యాయి.
దీంతో తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయింది ఆ దేశం. తాలిబన్ సర్కార్ (Taliban Modi )కు ఈరోజు వరకు ఎలాంటి గుర్తింపు లేదు. ఎక్కడ చూసినా పరిస్థితి దయనీయంగా ఉంది. దీంతో కొన్ని దేశాలు దయతలిచి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
వాటిలో అన్ని దేశాలకంటే ముందంజలో ఉంది సాయం చేయడంలో భారత దేశం. ఇదిలా ఉండగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్గనిస్తాన్ కు పక్కనే ఉన్న పాకిస్తాన్ కూడా గోధుమలను పంపించింది.
అయితే అవి ఎవరూ తినేందుకు రాకుండా ఉన్నాయని, పూర్తిగా నాసిరకం ధాన్యాన్ని పంపించిందంటూ తాలిబన్లు ఫైర్ అయ్యారు. చెత్తలో పార బోసేందుకు మాత్రమే పని కి వస్తాయంటూ వాపోయారు.
వాటిని ఖరాబు చేయడం ఇష్టం లేక తమకు పంపించారంటూ ఆవేదన చెందారు. ఇదే సమయంలో మోదీ నేతృత్వంలోన భారత ప్రభుత్వం మేలిరకం గోధుమలను పంపించిందంటూ కితాబు ఇచ్చారు.
తాలిబన్ ప్రతినిధులు ఈ మేరకు ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు ద్వారా పంపించేందుకు రెడీ కాగా పాకిస్తాన్ అడ్డు చెప్పింది. దీంతో ఇరాన్ ద్వారా సాయం చేస్తోంది ఇండియా ఆఫ్గాన్ కు.
Also Read : తటస్థ వైఖరితో భారీ మూల్యం