Indian Consulate Attack : భారత కాన్సులేట్‌కు నిప్పు
శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ రాడికల్స్ నిప్పు
Indian Consulate Attack : అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత రాయబార కార్యాలయంకు నిప్పు పెట్టారు. గత ఐదు నెలల్లో ఇది రెండో దాడి కావడం విశేషం. తెల్లవారుజామున 1.30 నుండి 2.30 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. దీని వెనుక ఖలిస్తానీ మద్దతుదారులు ఉన్నారని వెల్లడైంది. అగ్ని మాపక విభాగం వెంటనే తేరుకుంది. అగ్నికి ఆహుతి కాకుండా కాపాడింది. సిబ్బందికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. దీనిని ఖండిస్తున్నట్లు ప్రకటించింది.
శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్(Indian Consulate) వద్ద ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు పాల్పడిన హింసాత్మక చర్యను ప్రతి ఒక్కరు ఖండించారు. యుఎస్ లోని దౌత్య సౌకర్యాలు లేదా దౌత్య వేత్తలపై విధ్వంసం లేదా హింస చట్ట రీత్యా నేరంగా పేర్కొంది అమెరికా ప్రభుత్వం. దీనిపై తీవ్రంగా స్పందించాడు యుఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ . ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు ట్విట్టర్ వేదికగా.
భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా ప్రభుత్వానికి దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని హెచ్చరించింది. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ , హింసను ప్రేరేపించే ఏ పద్దతిని తాము హర్షించ బోమంటూ స్పష్టం చేసింది.
Also Read : Alluri Sitarama Raju : విప్లవ వీరుడు మన్నెం సూరీడు
