TIFF Indian Movies : టొరంటో ఫెస్టివ‌ల్ లో భార‌తీయ సినిమాలు

అయిదు సినిమాలు ప్ర‌ద‌ర్శ‌న

TIFF Indian Movies : టొరంటో వేదిక‌గా జ‌రుగుతున్న సినిమా పండుగ (ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ) లో(TIFF Indian Movies) భార‌త దేశానికి చెందిన ఐదు సినిమాలు చోటు ద‌క్కించుకున్నాయి.

గ్రేట‌ర్ టొరంలో ఏరియా లో ఎక్కువ‌గా ఇండో కెన‌డియ‌న్ జ‌నాభా ఉంది. ఈ ఏడాది క‌మ్యూనికి చెందిన వారిలో ద‌ర్శ‌కుడిగా పేరొందిన యోగి ద‌ర్శ‌క‌త్వం

వ‌హించిన క‌చ్చేయ్ లింబు తొలి ఫీచ‌ర్ ఫిలిం ఇందులో ఉంది.

టొరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ (టిఫ్ ) 2022 ఎడిష‌న్ లో భాగంగా ప‌లు సినిమాలు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. భార‌తీయ సినిమాకు(TIFF Indian

Movies) సంబంధించి చూస్తే క‌చ్చేయ్ లింబు మూవీ పాత క్రీడ‌ను కొత్త మార్గంలో ఆడ‌టం.

సెక్సిస్ట్ సంప్ర‌దాయాల‌ను స‌వాల్ చేయ‌డం లేదా ఎలా ఉండాల‌ని అనుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచ‌న‌ను మార్చు కోవ‌డం . అవ‌కాశాల‌ను స్వీక‌రించ‌డం గురించి..

గెలిచేందుకు కాదు. ఆటకు సంబంధించి స్వ‌చ్ఛ‌మైన ఆనందం కోసం ఆడ‌టం గురించిన చిత్రం తెలియ ప‌రుస్తుందని టిఫ్ పేర్కొంది. క‌మింగ్ ఆఫ్ ఏజ్

తోబుట్టువుల డ్రామా. క్రికెట్ నేప‌థ్యాన్ని క‌లిగి ఉంది ఈ చిత్రం నేప‌థ్యం.

ఇందులో న‌టి రాధిక మ‌ద‌న్ న‌టించారు. మ‌రొక డైరెక్ట‌ర్ నందితా దాస్ తీసిన జ్విగాటో. ఇందులో ఫుడ్ డెలివ‌రీ యాప్ కోసం డ్రైవ‌ర్ గా న‌టించిన భార‌తీయ హాస్య న‌టుడు క‌పిల్ శ‌ర్మ న‌టించారు.

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం మ‌ధ్య గిగ్ ఎక‌నామీపై ఓ విమ‌ర్శ‌. ఈ చిత్రాన్ని వాస్త‌విక శైలితో తీశారు. కార్మికుల హ‌క్కులు, సంఘీభావం గురించి

ఆలోచ‌న‌ల‌కు తెర తీస్తున్నారు.

జాతీయ అవార్డు గెలుచుకున్న ద‌ర్శ‌కురాలు రీమా దాస్ టోరా భ‌ర్త కూడా స్టేట్ లో ఉన్నారు. ద‌ర్శ‌కుడు విన‌య్ శుక్లా త‌న డాక్యుమెంట‌రీ వైల్ వి వాచ్డ్ ను కూడా ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు స‌త్య‌జిత్ రే చివ‌రి ఫీచ‌ర్ 1991లో రూపొందించిన అగంతుక్ కూడా ఈ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

Also Read : క‌ర్ణాట‌క బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సుదీప్

Leave A Reply

Your Email Id will not be published!