Indian Navy Chief : అద్భుత పథకం అగ్నిపథ్ స్కీం
నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్
Indian Navy Chief : కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన అగ్నిపథ్ పథకం అద్భుతమని కితాబు ఇచ్చారు నేవీ చీఫ్(Indian Navy Chief) అడ్మిరల్ ఆర్. హరి కుమార్. శనివారం ఆయన మాట్లాడారు. ఎందుకు నిరసన తెలుపుతున్నారో తెలియడం లేదన్నారు.
ఇలాంటి వాటిని తాను ఊహించ లేదని పేర్కొన్నారు. అగ్నిపథ్ స్కీం భారత సైన్యంలో అతి పెద్ద మానవ వనరుల నిర్వహణలో పరివర్తనకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు.
ఆయన వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. తాను అగ్నిపథ్ పథకం లో దాదాపు ఏడాదిన్నర పాటు పని చేశానని చెప్పారు ఆర్. హరి కుమార్(Indian Navy Chief). ఈ పథకం ప్రణాళిక బృందంలో భాగంగా ఉన్నానని పేర్కొన్నారు.
ఇది పూర్తిగా పరివర్తన పథకమని తెలిపారు. ఇది సాయుధ దళాలను అనేక విధాలుగా మారుస్తుందన్నారు. అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం దేశానికి, యువతకు ప్రయోజనకరంగా ఉందన్నారు.
ఎందుకంటే ఇది మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం, అపార్థం చేసుకోవడం వల్ల నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయని అభిప్రాయ పడ్డారు.
ఇంతకు ముందు సాయుధ దళాలలో పని చేసే అవకాశం ఒకరికి లభించే చోట ఇప్పుడు నలుగురికి అవకాశం ఉందన్నారు. అగ్ని పథ్ స్కీం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
ఇదిలా ఉండగా కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీహార్, యూపీ, హర్యానా, తెలంగాణ, తదితర రాష్ట్రాలలో రైళ్లు తగుల బెట్టారు.
బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తెలంగాణకు చెందిన రాకేశ్ అనే యువకుడు చని పోయాడు.
Also Read : ‘అగ్నిపథ్ వీరుల’కు 10 శాతం రిజర్వేషన్