Indian Origin Doctor : యుకెలో భార‌తీయ వైద్యుడి నిర్వాకం

48 మంది రోగుల‌పై లైంగిక వేధింపులు

Indian Origin Doctor : యుకెలో భార‌తీయ సంత‌తికి చెందిన వైద్యుడు కృష్ణ సింగ్(Indian Origin Doctor) నిర్వాకం మ‌రోసారి చ‌ర్చ‌కు దారి తీసింది. ఆయ‌న 48 మంది రోగుల‌పై లైంగిక నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు.

ముద్దులు పెట్ట‌డం, త‌ట్టి లేప‌డం, త‌గ‌ని ప‌రీక్ష‌లు ఇవ్వ‌డం, నీచ‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం, త‌దిత‌ర ఆరోప‌ణ‌లు స‌ద‌రు డాక్ట‌ర్ పై వ‌చ్చాయి. విచార‌ణ సంద‌ర్భంగా స‌ద‌రు డాక్ట‌ర్ ఆన్స‌ర్ (Indian Origin Doctor)ఇచ్చేందుకు నిరాక‌రించాడ‌ని స‌మాచారం.

2018లో ఓ మ‌హిళ డాక్ట‌ర్ కృష్ణ సింగ్ త‌న ప‌ట్ల ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఫిర్యాదు చేసింది. దీంతో మ‌నోడి బండారం బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది. విచిత్రం ఏమిటంటే స‌ద‌రు డాక్ట‌ర్ వ‌య‌సు 73 ఏళ్లు. 35 ఏళ్లు పైబ‌డిన 48 మంది మ‌హిళా రోగుల‌పై లైంగిక నేరాల‌కు పాల్ప‌డ్డాడు.

యుకె లోని గ్లాస్లోలోని హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. స్కాట్లాండ్ నుంచి అందిన నివేదిక‌ల ప్ర‌కారం డాక్ట‌ర్ కృష్ణ సింగ్  పై 1983 ఫిబ్ర‌వ‌రి నుంచి 2018 మే వ‌ర‌కు ఈ లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ నేరాలు ప్ర‌ధానంగా నార్త్ లానార్క్ షైర్ లోని వైద్య విధానాల‌లో చోటు చేసుకున్నాయి. ఇంతే కాదు ఆస్ప‌త్రి లో, అత్య‌వ‌స‌ర విభాగంలో, రోగుల ఇళ్ల‌ను సంద‌ర్శించిన స‌మ‌యంలో సైతం డాక్ట‌ర్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు.

నేరాలు చేయ‌డంలోనే ఆయ‌న ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంటూ ప్రాసిక్యూట‌ర్ ఏంజెలా గ్రే కోర్టుకు తెలిపారు. కొన్ని సార్లు సూక్ష్మంగా , మ‌రికొన్ని సార్లు స్ప‌క్షంగా స్ప‌ష్టంగా ఉంటుంది. లైంగిక నేరం అత‌ని జీవితంలో ఒక భాగంగా మారింద‌ని తెలిపింది.

Also Read : వేదాంత్ ప‌టేల్ పై అమెరికా ప్ర‌శంస

Leave A Reply

Your Email Id will not be published!