Indian Cricketers Temple : పద్మనాభుడి సన్నిధిలో క్రికెటర్లు
సంప్రదాయ దుస్తులతో దర్శనం
Indian Cricketers Temple : భారత క్రికెటర్లు హాట్ టాపిక్ గా మారారు. కేరళ లోని ప్రముఖ దేవాలయమైన పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. పూర్తిగా సంప్రదాయ దుస్తులు ధరించిన క్రికెటర్లు(Indian Cricketers Temple) స్వామి వారిని పూజించారు. ఈ సందర్బంగా వారిని పూజారులు ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి.
తిరువనంతపురంలో శ్రీలంకతో మూడో వన్డే జరిగింది. భారత జట్టు భారీ తేడాతో లంకేయులపై ఘన విజయాన్న నమోదు చేసుకుంది. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇద్దరూ సెంచరీలు చేస్తే మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.
అంతకు ముందు భారత క్రికెట్ జట్టులోని ప్లేయర్లంతా శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి(Indian Cricketers Temple) చేరుకున్నారు. వీరికి ఆలయ నిర్వాహకులు సంప్రదాయ బద్దంగా సాదర స్వాగతం పలికారు. ఆలయ నియమం మేరకు దుస్తులు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు. పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.
సంప్రదాయ దుస్తులతో మెరిసి పోయారు. తెల్లటి ధోది, అంగ వస్త్రం ధరించారు. పద్మనాభుడిని దర్శించుకున్న వారిలో సూర్య కుమార్ యాదవ్ , శ్రేయస్ అయ్యర్ , అక్షర్ పటేల్ , యుజ్వేంద్ర చాహల్ , వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్ , తదితరులు పూజలు చేశారు.
ఇదిలా ఉండగా భారత జట్టు ఇప్పటికే టీ20 సీరీస్ తో పాటు వన్డే సీరీస్ కూడా కైవసం చేసుకుంది. టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తే వన్డే జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించారు. అటు టీ20 , ఇటు వన్డే సీరీస్ లు భారత్ వశమయ్యాయి. జనవరి 18 నుంచి న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ స్టార్ట్ కానుంది.
Also Read : భారత్ న్యూజిలాండ్ బిగ్ ఫైట్